KTR : కేటీఆర్ పై కేసు నమోదు..ఎందుకంటే..!!
గత నెల 26న కేటీఆర్ బృందం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించిన విషయం తెలిసిందే. కాగా కేటీఆర్ పర్యటనలో అనుమతులు లేకుండా డ్రోన్ ఎగురవేశారని చెప్పి
- By Sudheer Published Date - 11:39 PM, Tue - 6 August 24

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) ఫై పోలీసులు కేసు నమోదు (Case File) చేసారు. గత నెల 26న కేటీఆర్ బృందం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించిన విషయం తెలిసిందే. కాగా కేటీఆర్ పర్యటనలో అనుమతులు లేకుండా డ్రోన్ ఎగురవేశారని చెప్పి..ఇరిగేషన్ అధికారి పోలీసులకు పిర్యాదు చేసారు. ఈ పిర్యాదు మేరకు కేటీఆర్ తో పాటు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణా రెడ్డిల మీద భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పీఎస్ లో బీఎన్ఎస్ 223(b) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసారు పోలీసులు. అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద డ్రోన్ ఎగరేశారంటూ..ఇరిగేషన్ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె తిహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్, హరీష్‌రావు ములాఖత్ అయ్యారు. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన.. పిటిషన్‌ను ఆమె వెనక్కు తీసుకున్నారు. రౌస్ అవెన్యూకోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో నిన్న కేసును వాయిదా వేయాలని కోరారు కవిత తరఫు న్యాయవాది. బెయిల్ కోసం త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also : Bangladesh : మాజీ ప్రధాని షేక్ హసీనాకి ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ వెన్నుపోటు ..?