TS: DAV స్కూల్ గుర్తింపు రద్దు..ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ మంత్రి..!!
ఎల్ కేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు కారణమైన బంజారాహిల్స్ లోని డీఏవి స్కూల్ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలంటూ విద్యాశాఖ మంత్రి పి. సబిత్రా ఇంద్రారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు.
- Author : hashtagu
Date : 21-10-2022 - 3:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఎల్ కేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు కారణమైన బంజారాహిల్స్ లోని డీఏవి స్కూల్ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలంటూ విద్యాశాఖ మంత్రి పి. సబిత్రా ఇంద్రారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండేలా పక్కన ఉన్న పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని మంత్రి సూచించారు. ఈ విషయంలో విద్యార్థుల పేరెంట్స్ సందేహాలను నివ్రుత్తి చేసే బాధ్యత పూర్తిగా విద్యాశాక అధికారిదేనని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు తీసుకోవల్సిన భద్రతపరమైన చర్యలను ప్రభుత్వానికి సూచించేందుకు విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసే బాధ్యతపై ఆయా పాఠశాలల యాజమాన్యాల నుంచి హామీపత్రం కూడా తీసుకునే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు.