TSRTC : బస్సు సర్వీసులు తగ్గుతాయి..సహకరించండి – మంత్రి పొన్నం ప్రభాకర్
- By Sudheer Published Date - 10:55 AM, Mon - 19 February 24

మేడారం (Medaram) మహా జాతర ఎల్లుండి నుండి మొదలుకాబోతుంది..కానీ నాల్గు రోజుల ముందే నుండి జాతరను తలపించేలా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అనేక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వస్తుండడం తో మేడారం అంత భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక మేడారం జాతర కోసం టీఎస్ఆర్టీసీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది.
We’re now on WhatsApp. Click to Join.
మేడారం జాతర సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ‘జాతరకు హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల నుంచి 6వేల ప్రత్యేక బస్సులు పంపించాం. దీనివల్ల ఇతర ప్రాంతాల్లో రెగ్యులర్ సర్వీసులు తగ్గుతాయి. ఫలితంగా ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆర్టీసీకి సహకరించాలి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి’ అని ఆయన కోరారు.
మేడారం బస్సులను ఆదివారం నుంచి ఫిబ్రవరి 25 వరకు నడిపించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 51 పాయింట్ల నుంచి, ఉమ్మడి వరంగల్జిల్లాలో 18 ప్రాంగణాల నుంచి ప్రత్యేకంగా 6000 బస్సులను నడిపిస్తోంది. ఈ ప్రత్యేక బస్సులను ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా బస్సులను నడిపేందుకు ఆర్టీసీ(TSRTC) అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గత జాతరకు ఆర్టీసీ బస్సుల ద్వారా 1.50 లక్షల మందికి పైగా భక్తులు చేరవేశారు. తాజా ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఈసారి భక్తులు ఎక్కువగా వస్తారని భావిస్తోంది.
Read Also : T.BJP : రేపటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు