Loan App Harassment: లోన్ యాప్ వేధింపుల కారణంగా బిటెక్ విద్యార్థి సూసైడ్
ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంది. వసరానికి తీసుకున్న రుణాన్ని చెల్లించలేక, పైగా వడ్డీల మీద వడ్డీలు మోపుతూ సామాన్యుల్ని తీవ్ర వేదనకు గురి చేస్తున్నారు.
- By Praveen Aluthuru Published Date - 05:45 PM, Tue - 27 February 24

Loan App Harassment: ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంది. వసరానికి తీసుకున్న రుణాన్ని చెల్లించలేక, పైగా వడ్డీల మీద వడ్డీలు మోపుతూ సామాన్యుల్ని తీవ్ర వేదనకు గురి చేస్తున్నారు. దీని బారీన పడ్డ ఎందరో ఆర్థికంగా బలయ్యారు. తాజాగా ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్నాడు.
ఆన్‌లైన్ లోన్ యాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేధింపుల కారణంగా మంగళవారం దుండిగల్‌లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి-కొత్తగూడెంకు చెందిన ఎస్.మనోజ్ కుమార్ (20) దుండిగల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో మూడో సంవత్సరం చదువుతున్నాడు. మనోజ్ రుణ యాప్‌ల ద్వారా డబ్బు తీసుకున్నాడు.
ఈఎంఐ సకాలంలో చెల్లించకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్లు అతని కాంటాక్ట్ లిస్ట్ నుండి కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు బంధువులకు ఫోన్ చేసి వేధించడం ప్రారంభించారు. దీంతో మనస్తాపం చెంది మనోజ్ తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు.
Also Read: YouTube Down : 20 నిమిషాలు యూట్యూబ్ డౌన్.. ఏమైంది ?