HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Vs Congress In Sathupally Assembly Constituency

BRS vs Congress : ప‌క్కా లోక‌ల్ అంటున్న స‌త్తుప‌ల్లి కాంగ్రెస్ అభ్య‌ర్థి.. నాలుగో సారి గెలుస్తానంటూ స‌వాల్ చేస్తున్న బీఆర్ఎస్ అభ్య‌ర్థి.. బ‌రిలో గెలిచి నిలిచేది ఎవ‌రు..?

ఖ‌మ్మం జిల్లాలో 2018 వ‌ర‌కు టీడీపీకి కంచుకోట‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం అది.. 2018 ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి భారీ మెజార్టీతో సండ్ర

  • Author : Prasad Date : 18-11-2023 - 10:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress
Congress

ఖ‌మ్మం జిల్లాలో 2018 వ‌ర‌కు టీడీపీకి కంచుకోట‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం అది.. 2018 ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి భారీ మెజార్టీతో సండ్ర వెంక‌ట‌వీర‌య్య గెలిచారు. అయితే కొన్ని నెల‌లు తిర‌గ‌కుండానే ఆయ‌న అప్ప‌టి టీఆర్ఎస్‌.. ఇప్ప‌డు బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఆయ‌న‌తో పాటు అతికొద్ది మంది నాయ‌కులు మాత్రమే టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. అయితే ఇక్క‌డ టీడీపీ క్యాడ‌ర్ మాత్రం సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌తో వెళ్ల‌లేదు. గ్రౌండ్ లెవ‌ల్‌లో టీడీపీ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉంది. అయితే ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీ చేయ‌క‌పోవ‌డంతో మొట్ట‌మొద‌టిసారి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నుంచి అభ్య‌ర్థి లేరు. అయితే ఇప్పుడు టీడీపీ ఓటింగ్ అంతా ఎవ‌రి వైపు వెళ్తుంది అన్న ప్ర‌శ్న అంద‌రిలో నెల‌కొంది. బీఆర్ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్యకు టీడీపీలో యువ‌త‌,నాయ‌కులు అంతా వ్య‌తిరేకంగా ఉన్నారు. ఆయ‌న కోసం ఎన్నిక‌ల్లో ప‌ని చేసిన వారిపై అధికార పార్టీలోకి వెళ్లాక కేసులు పెట్టించారంటూ తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. దీంతో టీడీపీ ఓటింగ్ బీఆర్ఎస్ వైపు వ‌చ్చే అవ‌కాశం లేదు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటు కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ప్ర‌ముఖ వైద్యురాలు డాక్ట‌ర్ మ‌ట్టా రాగ‌మ‌యి బ‌రిలో ఉన్నారు. తొలుత మ‌ట్టా ద‌యానంద్ విజ‌య్‌కుమార్ బ‌రిలో ఉన్న‌ప్ప‌టికి మ‌హిళా కోటాలో ఆయ‌న స‌తీమ‌ణికి టికెట్ ద‌క్కింది. స‌త్తుప‌ల్లి కాంగ్రెస్ టికెట్ కోసం చాలా మంది బ‌రిలో నిలిచినప్ప‌టికి మ‌ట్టా రాగ‌మ‌యి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన ద‌యానంద్ విజ‌య్‌కుమార్ ..అప్ప‌టి టీడీపీ అభ్య‌ర్థిగా ఉన్న ప్ర‌స్తుత ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌పై 2400 ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు.2018 ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌లో మ‌ట్టా ద‌యానంద్ చేరిన‌ప్ప‌టికి ఆయ‌న‌కు టికెట్ రాలేదు. వైసీపీలో ఉన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న పొంగులేటి వ‌ర్గంగా ఉన్నారు. అయితే ఇటీవ‌ల పొంగులేటికి, మ‌ట్టాకు కాస్త గ్యాప్ పెరిగింది. అందుకోస‌మే టికెట్ ప్ర‌క‌ట‌న‌లో జాప్యం జ‌రిగింద‌ని కాంగ్రెస్ క్యాడ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపిస్తుంది. అయినప్ప‌టికి ఎట్టేకేల‌కు మ‌ట్టా ద‌యానంద్ టికెట్ ద‌క్కించుకున్నారు.

Also Read:  Maoist Party : బిఆర్ఎస్ పార్టీని తన్ని తరిమేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు

గ‌త ఎన్నిక‌ల్లో మ‌హాకూట‌మిలో భాగంగా ఇక్క‌డ కాంగ్రెస్ పోటీ చేయ‌లేదు. పొత్తులో ఈ సీటుని టీడీపీకి కేటాయించ‌డంతో రెండు పార్టీల ఓట్లు మ‌హాకూట‌మి అభ్య‌ర్థిగా పోటీ చేసిన సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌కు ప‌డ్డాయి. బీఆర్ఎస్ నుంచి పిడ‌మ‌ర్తి ర‌వికి 80వేల ఓట్లు పోల్అయ్యాయి. కాంగ్రెస్ పోటీ చేయ‌క‌పోవ‌డంతో టీడీపీ నుంచి సండ్ర వెంక‌ట‌వీర‌య్య భారీ మెజార్టీతో గెలిచారు.అయితే ఇప్పుడు 2014 ఎన్నిక‌లే రిపీట్ అయ్యేలా ప‌రిస్థితి క‌నిపిస్తుంది. ఇద్ద‌రి మ‌ధ్య హోరాహోరి పోరు జ‌ర‌గనుంది. కాంగ్రెస్‌కు ఈ సారి టీడీపీ ఓటు బ్యాంక్ క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి మ‌ట్టా రాగ‌మ‌యి ద‌యానంద్ ప‌క్కా లోక‌ల్ అంటూ ప్ర‌చారం లో దూసుకుపోతుండ‌గా.. నాలుగోసారి నేనే గెలుస్తానంటూ బీఆర్ఎస్ అభ్య‌ర్థి సండ్ర వెంక‌ట‌వీరయ్య స‌వాల్ చేస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆరుసార్లు టీడీపీ గెలిచింది. గ‌త రెండు ప‌ర్యాయాలు ఇక్క‌డ బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోతుంది. మ‌రి ఈ సారి స‌త్తుప‌ల్లిలో ఏ జెండా ఎగురుతుందో డిసెంబ‌ర్ 3తేదీ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 telangana elections
  • brs
  • congress
  • Matta dayanand
  • Matta Ragamayi
  • sandra venkata veeraiah
  • tdp

Related News

Ktr Visit To Kannepalli Pum

KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నీళ్లు అందుబాటులో ఉన్నా రైతులకు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు.

    Latest News

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd