HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Rythu Deeksha On Kodangal

BRS Rythu Deeksha : రేవంత్ అడ్డాలో బిఆర్ఎస్ దీక్ష

BRS Rythu Deeksha : ఈ నెల 10న నిర్వహించనున్న ఈ దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు.

  • Author : Sudheer Date : 05-02-2025 - 8:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brs Deeksha Kondagal
Brs Deeksha Kondagal

తెలంగాణ(Telangana)లో రాజకీయ వేడి రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సొంత నియోజకవర్గమైన కొడంగల్‌(Kodangal)లో బీఆర్ఎస్ పార్టీ భారీ రైతు దీక్ష(BRS Raithu Deeksha)కు సిద్ధమవుతోంది. ఈ నెల 10న నిర్వహించనున్న ఈ దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేయలేదని బీఆర్ఎస్ గత కొద్దీ రోజులుగా ఆరోపిస్తోంది. రుణమాఫీ, ఉచిత విద్యుత్, పంటలకు మద్దతు ధర వంటి అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టనున్నారు.

Caste Census Survey : కుల గణనతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది – భట్టి

బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ అస్వస్థత కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండగా, పార్టీ భారం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భుజాలపై పడింది. ఆయన నేతృత్వంలో బీఆర్ఎస్ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ప్రత్యేకంగా రైతు సమస్యలపై పోరాటం చేస్తామని, దీనికోసం నిరసనలు, దీక్షలు నిర్వహిస్తామని కేటీఆర్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూ వస్తున్నారు. దీనికి తగ్గట్లే ప్రభుత్వం ఫై దూకుడు గా వ్యవహారిస్తూ ప్రతి సమస్యపై గళం విప్పుతూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ప్రారంభించిన రెండు నెలలు పూర్తికాగానే బీఆర్ఎస్, బీజేపీ పార్టీల విమర్శలు మొదలుపెట్టాయి. రైతులను ఆదుకోవడం లేదని కాంగ్రెస్‌పై బిఆర్ఎస్ ఒత్తిడి తెస్తుండగా, బీజేపీ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. రానున్న రోజులలో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశముంది. రైతుల సమస్యలను ప్రధాన అంశంగా తీసుకుని బీఆర్ఎస్ దీక్ష చేపడుతున్నా, దీని ప్రభావం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్..వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేయాలనీ డిమాండ్ చేస్తుంది. మరి కొండగల్ దీక్ష కు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా..? లేదా అనేది చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS Rythu Deeksha
  • cm revanth
  • February 10
  • Kodangal

Related News

Cm Revanth Key Update On Fr

Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.70 లక్షల మంది విద్యార్థినులను లబ్ధిదారులుగా ప్రాథమికంగా గుర్తించారు. ఒక్కో స్కూటీ కొనుగోలు మరియు ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే, ఈ పథకం అమలుకు సుమారు రూ. 1,600 కోట్లు ఖర్చవుతుందని అధికారిక వర్గాలు

  • Cm Revanth Good News

    Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

  • There Will Be No Urea Probl

    Urea Shortage : రైతులకు గుడ్ న్యూస్..తెలంగాణ లో ఇకపై యూరియా కష్టాలు ఉండవు !!

  • Telangana Congress Nominate

    Rajyasabha : రాజ్యసభ అభ్యర్థులుగా తెలంగాణ నుండి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd