BRS Lok sabha Candidates : మెదక్ ఎంపీ బరిలో కేసీఆర్..?
- By Sudheer Published Date - 09:37 PM, Tue - 26 December 23
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election 2023) ఘోర పరాజయం చవిచూసిన బిఆర్ఎస్ (BRS)..లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లో విజయ డంఖా మోగించాలని చూస్తుంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో బోల్తా పడ్డ కేసీఆర్..ఈసారి గెలుపు గుర్రాలకే (Lok sabha Candidates) ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే క్రమంలో మెదక్ నుండి ఎంపీ బరిలో నిల్చువాలని కేసీఆర్ (KCR) ఆలోచన చేస్తున్నట్లు వినికిడి. అందుకే మెదక్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ని అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించారు. ఇక ఇప్పుడు మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేసేందుకే సిద్ధం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఎంపీ స్థానాలకు గాను పలువురిని (BRS Lok sabha Candidates) ఇప్పటికే కేసీఆర్ ఖరారు చేసి పెట్టాలని అంటున్నారు.
- BRS Lok sabha Candidates List..?
- మహబూబ్నగర్ నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి
- జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్
- నాగర్ కర్నూల్ నుంచి గువ్వల బాలరాజు
- కరీంనగర్ నుంచి వినోద్
- పెద్దపల్లి నుంచి బాల్క సుమన్ లేదా వెంకటేష్
- నిజామాబాద్ నుంచి కవిత
- ఆదిలాబాద్ నుంచి గూడెం నగేష్
- వరంగల్ నుంచి రాజయ్య
- నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి
- భువనగిరి నుంచి బాలరాజు యాదవ్
- ఖమ్మం పార్లమెంట్ నుంచి నామా నాగేశ్వర్రావు
- మహబూబాబాద్ నుంచి రెడ్యా నాయక్
- మల్కాజ్గిరి నుంచి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి
- సికింద్రాబాద్ నుండి తలసాని కుమారుడు సాయి లకు టికెట్స్ ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని సమాచారం. మరి ఫైనల్ గా ఇదే ఫిక్స్ చేస్తారా..? ఏమైనా మార్పులు చేస్తారా..? అనేది చూడాలి.
Read Also : AP Anganwadi Workers Protest : రేపటి నుండి వైసీపీ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద అంగన్వాడీల నిరసన ..
Related News
Telangana Politics : మరో ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్న తెలంగాణ..!
పార్లమెంటు ఎన్నికలు ముగియడం, ఫలితాలు పెండింగ్లో ఉండటంతో రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ దృష్టిని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై మళ్లించాయి.