BRS MLAs Meets KCR : ఎన్నికల్లో గెలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం
కొత్త ప్రభుత్వానికి సహకరిద్ధం అని ఆయన చెప్పుకొచ్చారు. ఏమి జరుగుతుందో వేచి చూద్దాం
- Author : Sudheer
Date : 04-12-2023 - 8:18 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS New MLAs) తో మాజీ సీఎం , బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) సమావేశమయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌కు వచ్చిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ చర్చించారు.
తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిద్దాం అని తెలిపారు. రాజ్యాంగ బద్దంగా జనవరి 16 వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉండే.. కానీ, ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకున్నాం.. కొత్త ప్రభుత్వానికి సహకరిద్ధం అని ఆయన చెప్పుకొచ్చారు. ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.. త్వరలో తెలంగాణ భవన్ లో పార్టీ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ఫలితాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తాను.. త్వరలో శాసన సభ పక్ష నేతను ఎన్నుకుందామని కేసీఆర్ పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలతో తెలంగాణ భవన్‌లో సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు సమాచారం. ఈ మీటింగ్ తర్వాత కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్‌కు వెళ్లారు. ఇక, కేసీఆర్ ను కలిసిన వారిలో హరీశ్ రావు, కేటీఆర్, పట్నం మహేందర్ రెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, కడియం, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు.
Read Also : Janagama BRS President Dies : జనగామ బీఆర్ఎస్ జెడ్పీ ఛైర్మన్ మృతి