BRS MLAs : మంత్రి శ్రీధర్ బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం..
గత కొద్దీ రోజులుగా బిఆర్ఎస్ నేతలు వరుసగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ కేసీఆర్ కు షాకుల మీద షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే
- By Sudheer Published Date - 06:24 PM, Sat - 6 July 24

కాంగ్రెస్ నేతలతో ఎవరైనా బిఆర్ఎస్ నేత (BRS) మాట్లాడితే చాలు..బిఆర్ఎస్ పార్టీ లో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. దీనికి కారణం చెప్పాల్సిన పనిలేదు. గత కొద్దీ రోజులుగా బిఆర్ఎస్ నేతలు వరుసగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ కేసీఆర్ కు షాకుల మీద షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఓడిన ఎమ్మెల్యేలే కాదు గెలిచినా ఎమ్మెల్యేలు సైతం కారు దిగి హస్తం కిందకు చేరుతున్నారు. ఈ మధ్యనే ఒకరిద్దరు కాదు ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. మరి ఆరుగురు , ఏడుగురు వరకు కూడా కాంగ్రెస్ లో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో శనివారం మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar)తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS MLAS) సమావేశం (Meeting) అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్, కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరిక పూడి గాంధీ ఈ రోజు మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. వీరు తమ తమ నియోజకవర్గాల అభివృద్ధి కి సంబదించిన అంశాలపై మంత్రి తో చర్చించేందుకు వెళ్ళమని చెపుతున్నప్పటికీ ..లోపల మాత్రం వీరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు గాను వెళ్లినట్లు అంత మాట్లాడుకుంటున్నారు.
దీనికి కారణం కూడా లేకపోలేదు. నిన్న తెలంగాణ భవన్లో గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సమావేశం జరిగింది. మాజీ మంత్రి , సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యం లో ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి లు హాజరు కాలేదు. వీరు హాజరుకాకపోవడం తో వీరంతా కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు కావొచ్చు..అందుకే సమావేశానికి హాజరు కాలేదని నిన్నంతా మాట్లాడుకున్నారు. ఈరోజు ఆ నేతలే మంత్రి శ్రీధర్ తో సమావేశం అయ్యేసరికి వీరంతా త్వరలోనే కాంగ్రెస్ లో చేరడం ఖాయం అంటున్నారు. మరి నిజంగా చేరతారా..లేదా అనేది చూడాలి.
Read Also : Chilli Price: ఎండు మిర్చి ధర పతనం, రైతుల ఆశలపై నీళ్లు…