MLA Jogu Ramanna : ఎమ్మెల్యే జోగు రామన్న సంచలన వ్యాఖ్యలు.. తనను కాంగ్రెస్ నేత..?
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్‌రెడ్డి కుట్ర పన్నారని
- By Prasad Published Date - 06:29 AM, Sun - 30 July 23

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్‌రెడ్డి కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నేత, ఎన్‌ఆర్‌ఐ కంది శ్రీనివాస్‌రెడ్డి తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కంది శ్రీనివాస్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు. తనపై చేసిన ఆరోపణలు కోర్టులో రుజువైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పారు. తనపై చేసిన ఆరోపణలు రుజువైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, తన ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమైతే కంది శ్రీనివాస్ రెడ్డి అమెరికా వెళ్లిపోతావా అని సవాల్ విసిరారు. తాను మహారాష్ట్రలో భూములు కొనుగోలు చేయలేదని, కంది శ్రీనివాస్ రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా రూ.5 వేల కోట్లు కూడా ఆదా చేయలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ టికెట్ కోసం కంది శ్రీనివాస్ రెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని.. గ్రామస్థాయి నాయకుడి నుంచి శాసనసభ్యుని స్థాయికి తాను ఎదిగానని జోగు రామన్న పేర్కొన్నారు