HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Is Ready For The Lok Sabha Elections Preparatory Meetings From January 3

BRS: లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం, జనవరి 3 నుంచి సమావేశాలు షురూ!

జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నది.

  • Author : Balu J Date : 29-12-2023 - 3:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BRS Story

BRS: పార్లమెంట్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సమయత్తమవుతుంది. ఇందులో భాగంగా  జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్యనాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ భవన్ లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో… మధ్యలో మూడురోజుల విరామమిచ్చి, మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత పార్టీ కొనసాగించనున్నది.

ఈ సమావేశాలకు ఆయా పార్లమెంట్ పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల యంపిలు, నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇంచార్జీలు, జిల్లాపార్టీ అద్యక్షులు మొదలుకొని పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సమావేశాలకు హాజరవుతారు.

తెలంగాణ భవన్ లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మీటింగ్ కు హాజరయ్యే ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోనే అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచారపర్వాన్ని బలంగా నిర్వహించేందుకు కూడా పార్టీ యంత్రాంగం  కసరత్తు చేస్తోంది. మొదట జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది.

తేదీలవారీగా పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహాక సమావేశాల వివరాలు ఇలా ఉన్నాయి…

• 3న ఆదిలాబాద్

• 4న కరీంనగర్

• 5న చేవెళ్ల

• 6న పెద్దపల్లి

• 7న నిజామాబాద్

• 8న జహీరాబాద్

• 9న ఖమ్మం

• 10న వరంగల్,

• 11న మహబూబాబాద్

• 12న భువనగిరి

సంక్రాంతి అనంతరం.. 

• 16న నల్గొండ

• 17న నాగర్ కర్నూలు

• 18న మహబూబ్ నగర్

• 19న మెదక్

• 20న మల్కాజ్ గిరి

• 21 సికింద్రాబాద్ మరియు హైదరాబాద్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024
  • brs
  • kcr
  • loksabha polls

Related News

Psr Saval Kcr

Ponguleti Srinivas Reddy : కేసీఆర్‌కు మంత్రి పొంగులేటి బహిరంగ సవాల్

మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సవాల్ విసిరారు

    Latest News

    • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

    • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

    • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

    • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

    • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

    Trending News

      • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

      • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd