Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం
Real Estate : హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఘోరంగా కుప్పకూలిందని, బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ వస్తుంది
- By Sudheer Published Date - 03:20 PM, Tue - 4 February 25

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress ) వచ్చాక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ (Hyderabad Real Estate) పడిపోయిందని , చాల నిర్మాణాలు ఆగిపోయాయని , ఫ్లాట్స్ ను కొనుగోలు చేసేందుకు ఎవ్వరు ముందుకు రావడంలేదని ఇలా బీఆర్ఎస్ (BRS) చేస్తున్న తప్పుడు ప్రచారం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఘోరంగా కుప్పకూలిందని, బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ వస్తుంది. ముఖ్యంగా జీడిమెట్లలో ఓ బిల్డర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను ప్రధానంగా ప్రస్తావిస్తూ, మార్కెట్ పూర్తిగా పతనమైందని ప్రచారం చేస్తున్నారు. అయితే వాస్తవాన్ని పరిశీలిస్తే.. రియల్ ఎస్టేట్ కరెక్షన్ లో ఉన్నా, అది పూర్తిగా కూలిపోయిందనడానికి ఆధారాలు లేవని స్పష్టమవుతోంది.
ప్రతీ వ్యాపారంలో ఒడిదుడుకులు సహజం. రియల్ ఎస్టేట్ లాంటి రంగాల్లో పెట్టుబడులు భారీగా ఉంటాయి. గడచిన కాలంలో వడ్డీ రేట్లు పెరగడం, ఆర్థిక మాంద్యం, ఎన్నికల ప్రభావం వంటి కారణాలతో మార్కెట్ కాస్త మందగించిందని చెప్పవచ్చు. కానీ కేవలం ఒక బిల్డర్ ఆత్మహత్య చేసుకున్నాడని మొత్తం రియల్ ఎస్టేట్ రంగం కూలిపోయిందని చెప్పడం అవాస్తవం. ఏ రంగానికైనా తన అంచనాలను సమీక్షించుకుని, పరిస్థితులకు తగిన మార్పులు చేసుకోవడం అవసరం. ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ డిమాండ్ తగ్గింది. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు, పొదుపు ధోరణులు, రాజకీయ అనిశ్చితి కారణంగా కొనుగోలు మందగించింది. అయితే ఎన్నికల అనంతరం పరిస్థితి మళ్లీ పుంజుకుంది. హైదరాబాద్ లాంటి నగరంలో రియల్ ఎస్టేట్ డిమాండ్ పూర్తిగా తగ్గిపోవడం అసాధ్యం. చట్టబద్ధంగా ఉన్న నిర్మాణాలను ఏ ప్రభుత్వమూ తేలికగా కూల్చివేయదన్న విషయం కొనుగోలుదారులకు తెలుసు.
ప్రస్తుతం మార్కెట్ తిరిగి జోరు అందుకుంది. హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి., కొత్త ప్రాజెక్టులకు మంచి స్పందన వస్తోంది. అలాగే కొంత కాలంగా ధరలు స్థిరంగా ఉండటంతో కొనుగోలుదారులు తిరిగి మార్కెట్‌లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాకపోతే బిఆర్ఎస్ పార్టీ తమ స్వలాభం కోసం రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదజల్లు తుంది తప్ప మరోటి లేదు. అంతిమంగా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరింత పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతకాలం కుదుపు అనివార్యం అయినా, దీన్ని తీవ్రతరంగా చూపించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం అనైతికం. వాస్తవాలను సమర్థంగా విశ్లేషించుకొని, మార్కెట్ పునరుద్ధరణపై దృష్టి పెడితే రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందుతుంది.