HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bjp Leader Sanjay Bandi Efforts For Ukraine Students

Sanjay Bandi: ఉక్రెయిన్ విద్యార్థుల కోసం ‘బండి’ చొరవ

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశం తరలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ పేరుతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుండగా మరోవైపు బిజెపి తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ బాధిత తెలుగు విద్యార్థులను తరలించేందుకు నిరంతరం సహకారం అందిస్తున్నారు.

  • Author : Hashtag U Date : 02-03-2022 - 7:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bandi Sanjay Ukraine Imresizer
Bandi Sanjay Ukraine Imresizer

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశం తరలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ పేరుతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుండగా మరోవైపు బిజెపి తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ బాధిత తెలుగు విద్యార్థులను తరలించేందుకు నిరంతరం సహకారం అందిస్తున్నారు.
ఉక్రెయిన్ సరిహద్దుకు దూరంగా ఉన్న బాధితులను తరలించేందుకు ఏర్పాటు చేసిన బస్సులు సరిపోకపోవడంతో, ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనను బండి సంజయ్ భారత రాయబార కార్యాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన భారత రాయబార కార్యాలయ అధికారులు ఉక్రెయిన్ దౌత్య అధికారులతో మాట్లాడి రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. దీంతో 1500 మంది భారతీయ విద్యార్థులు స్లొవేకియా, హంగేరి సరిహద్దులకు పయనమయ్యారు.

షీ ఫౌండేషన్ చైర్ పర్సన్, డబ్ల్యూహెచ్ సీ ఇండియా మిషన్ హెడ్ డా. సుధా రెడ్డి ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. రెండ్రోజుల క్రితం ( ఫిబ్రవరి 28న) ఉక్రెయిన్ బాధిత విద్యార్థులు, వారి తల్లితండ్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, నాయకులతో వర్చువల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ వర్చువల్ కాన్ఫరెన్స్ లో బండి సంజయ్ కుమార్ తో పాటు బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జపొరోజియా రాష్ట్రంలోని జపొరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థులతో పాటు, సమీపంలో సుమారు 1500 మంది భారతీయులు బంకర్లలో తలదాచుకున్నారని, అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులూ పెద్ద సంఖ్యలో ఉన్నారని ఈ సమావేశం ద్రుష్టికి వచ్చింది.

యుద్ధం నేపథ్యంలో వారంతా స్లవోకియా, హంగేరి సరిహద్దుకు చేరుకోవడం ఇబ్బందిగా మారింది. స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులు పెద్దసంఖ్యలో ఉన్నప్పటికీ భారతీయులను తరలించేందుకు అవి ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో పెద్దసంఖ్యలో ఉన్న భారతీయులను సరిహద్దు పట్టణం ఉజ్గారోడ్ తరలించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయించేందుకు సహకరించాల్సిందిగా డా. సుధా రెడ్డి బండి సంజయ్ కుమార్ ను కోరారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ వెంటనే ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు.

బండి సంజయ్ అభ్యర్థనతో కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేయగా, వారు స్థానిక అధికారులను సంప్రదించి భారతీయులను తరలించేందుకు రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక రైళ్లలో 1500 మంది భారతీయులు స్లవేకియా, హంగేరి సరిహద్దు పట్టణమైన ఉజ్గారోడ్ కు బయలుదేరారు. అక్కడి నుంచి ఉక్రెయిన్ సరిహద్దు దాటితే ‘ఆపరేషన్ గంగా’ కింద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల ద్వారా వారు స్వదేశం రావడం సులువవుతుంది.

తన విజ్ఞప్తిని మన్నించి భారతీయ విద్యార్థుల తరలింపు కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన బండి సంజయ్ కుమార్ సహా సహకరించిన కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయ అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి డా. సుధా రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్ బాధితుల తరలింపు విషయంలో బండి సంజయ్ కుమార్ ఇప్పటికే అనేక చర్యలు చేపట్టారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఉక్రెయిన్ బాధితుల సహాయార్థం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు విద్యార్థులతో వీడియా కాల్ ద్వారా, బాధిత కుటుంబాలతో నేరుగా మాట్లాడి వారిలో భరోసా నింపుతున్నారు. ఆయా విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడు విదేశీ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరవేస్తూ స్వదేశానికి తరలించేలా పర్యవేక్షిస్తూనే ఉన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • BJP leader helps students
  • state bjp chief
  • Telangana BJP
  • ukraine students

Related News

Bjp Chalo Assembly

BJP: నేడు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపు

Telangana Budget అధికార కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నేతృత్వంలో ఈ రోజు ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నిరసన కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, నేతలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి తరలివస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై అసెంబ్లీ పరిసరాల్లో భారీ బందో

  • BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

    Telangana : తెలంగాణ మరో శ్రీలంక కాబోతోంది – బండి సంజయ్

Latest News

  • Putin: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన పుతిన్.. రష్యా నుంచి ఇరాన్‌కు డ్రోన్లు..

  • Vijay Mallya: నాడు పెట్టిన పెట్టుబడికి నన్ను చూసి చాలా మంది నవ్వుకున్నారు: విజ‌య్ మాల్యా

  • Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

  • Peddi Tickets : పెద్ది అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్

  • Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

Trending News

    • Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

    • ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

    • ఐపీఎల్ 2026.. ఆట‌గాళ్ల‌కు కొత్త నిబంధ‌న‌లు!

    • పాకిస్థాన్ వేదిక‌గా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు?!

    • రూ. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd