HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Bjp Bumper Offer To Ayodhya Ram Devotees Special Trains From Telangana To Ayodhya

Ayodhya Trains : తెలంగాణ టు అయోధ్య.. 17 రోజులు బీజేపీ ప్రత్యేక రైళ్లు ఇవే..

Ayodhya Trains : సామాన్య భక్తులకు ఈరోజు నుంచి అయోధ్య రాముడి దర్శనం కల్పిస్తున్నారు.

  • By Pasha Published Date - 02:09 PM, Tue - 23 January 24
  • daily-hunt
Ayodhya Trains
Ayodhya Trains

Ayodhya Trains : సామాన్య భక్తులకు ఈరోజు నుంచి అయోధ్య రాముడి దర్శనం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులను ఫ్రీగా అయోధ్య యాత్రకు తీసుకెళ్లేందుకు ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘ఆస్థా’ పేరుతో ప్రత్యేక రైళ్లను(Ayodhya Trains) నడపనున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందిని ఇందుకోసం ఎంపిక చేస్తారు. ఆస్థా ప్రత్యేక రైళ్లను కాజీపేట, సికింద్రాబాద్‌ నుంచి నడుపుతారు. ఈ ప్రత్యేక రైళ్లలో 20 బోగీలుంటాయి. ఒక్కో రైలులో 1,400 మంది ప్రయాణించవచ్చు. ప్రతి బోగికి ఒక ఇంఛార్జిని నియమించారు. అయోధ్యకు వెళ్లి రావడానికి 5 రోజుల టైం పడుతుంది. అయోధ్యకు వెళ్లే ఉచిత రైళ్ల షెడ్యూల్‌ను బీజేపీ ప్రకటించింది. సికింద్రాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్, మల్కాజిగిరి, మెదక్ పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన భక్తులు సికింద్రాబాద్‌లో రైలు ఎక్కాల్సి ఉంటుంది. నల్గొండ, వరంగల్, మహబూబాబాద్‌, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, నియోజకవర్గాలకు చెందిన వారు కాజీపేటలో ఆయా తేదీల్లో అందుబాటులో ఉండే రైలు ఎక్కాలి.

  • కాజీపేట నుంచి అయోధ్యకు 07223 నెంబరు రైలు జనవరి 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28వ తేదీల్లో, అయోధ్య నుంచి కాజీపేటకు ఫిబ్రవరి 2, 4, 6, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, మార్చి 2 తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉండనుంది.
  • సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు 07221 నెంబరుతో మరో ప్రత్యేక రైలు ఈనెల 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీలలో అందుబాటులో ఉంటుంది. అయోధ్య నుంచి సికింద్రాబాద్‌కు  ఇదే నెంబరుతో ఫిబ్రవరి 1, 3, 5, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, మార్చి 1, 3 తేదీల్లో రైలు నడుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

నియోజకవర్గాలు – రైళ్లు బయలుదేరే తేదీలు

  • సికింద్రాబాద్ – జనవరి 29
  • వరంగల్ – జనవరి 30
  • హైదరాబాద్ – జనవరి 31
  • కరీంనగర్ – ఫిబ్రవరి 1
  • మల్కాజిగిరి – ఫిబ్రవరి 2
  • ఖమ్మం – ఫిబ్రవరి 3
  • చేవెళ్ల – ఫిబ్రవరి 5
  • పెద్దపల్లి – ఫిబ్రవరి 6
  • నిజామాబాద్ – ఫిబ్రవరి 7
  • ఆదిలాబాద్ – ఫిబ్రవరి 8
  • మహబూబ్‌నగర్‌ – ఫిబ్రవరి 9
  • మహబూబాబాద్‌ – ఫిబ్రవరి 10
  • మెదక్ – ఫిబ్రవరి 11
  • భువనగిరి – ఫిబ్రవరి 12
  • నాగర్ కర్నూల్ – ఫిబ్రవరి 13
  • నల్గొండ – ఫిబ్రవరి 14
  • జహీరాబాద్ – ఫిబ్రవరి 15

Also Read: KVP : రంగంలోకి రాజకీయ మాంత్రికుడు.. వైసీపీ అసంతృప్తులు టార్గెట్‌గా వ్యూహరచన

రాముడిని చూడకుండా.. పూజారి ముఖం ఎందుకు కప్పుకున్నాడు..!

అయోధ్య ఆలయంలోని గర్భగుడిలో.. శ్రీరాముడిని చూడకుండా ఓ పూజారి తన ముఖానికి దుప్పటా కప్పుకున్నాడు.. ఎందుకు ఇలా చేశారు అనేది ఇప్పుడు అందరిలో ప్రశ్నలు.. సోషల్ మీడియాలో విపరీతమైన చర్చనీయాంశం అయ్యింది.. ఈ విషయంపై కర్నాటకకు చెందిన ఓ ప్రముఖ పూజారి వివరణ ఇచ్చారు.. అదేంటో తెలుసుకుందాం.. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుక నుండి ఒక ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఆసక్తికరమైన ఫొటోలో, ఉడిపికి చెందిన పెజావర్ మఠాధీశ స్వామి విశ్వప్రసన్న తీర్థ అనే పూజారి ఆచారాల సమయంలో తన ముఖాన్ని కప్పుకుని కనిపించారు. గర్భ గుడిలో ఉన్న కెమెరాకు చిక్కిన ఈ సంఘటన..  ఆయనలా ప్రవర్తించడంపై చర్చలకు ప్రేరేపించింది. స్వామి విశ్వప్రసన్న తీర్థ తన ముఖాన్ని కప్పి ఉంచడానికి ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది రాముడికి పవిత్ర నైవేద్యాన్ని సమర్పించే సమయంలో జరిగింది. ఈ చిత్రం స్వామికి దైవంతో ఉన్న లోతైన సంబంధాన్ని, దేవుని పట్ల ఆయనకున్న అత్యంత గౌరవాన్ని సూచిస్తోంది. ప్రాణ ప్రతిష్ట వేడుకను ప్రత్యక్షంగా చూసిన సహనా సింగ్ అనే X యూజర్ తన ఖాతాలో ఈ క్షణం చిత్రాన్ని పంచుకున్నారు. స్వామి విశ్వప్రసన్న తీర్థ చేసిన ఈ పని ప్రాముఖ్యతను ఆమె ఎత్తిచూపారు. ఇది నైవేద్యం సమర్పించినప్పుడు రాముని పట్ల భక్తి, గౌరవానికి సంకేతమని చెప్పుకొచ్చారు.

If you were watching the Prana Pratishta ceremony of Ram Lalla closely, you would have seen how Udupi's Pejawar Mathadhisha Swami Vishwaprasanna Tirtha covered his face at one point during the rituals. This was when Naivedya was being offered to the Bhagwan. (1) pic.twitter.com/FF0fbP7lQp

— Sahana Singh (@singhsahana) January 23, 2024


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ayodhya
  • Ayodhya Ram Mandir
  • Ayodhya Trains
  • Hyderabad To Ayodhya
  • Kazipet To Ayodhya
  • ram mandir
  • Secunderabad To Ayodhya

Related News

    Latest News

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd