MallaReddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ ..
- Author : Sudheer
Date : 02-03-2024 - 12:45 IST
Published By : Hashtagu Telugu Desk
మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MallaReddy)కి బిగ్ షాక్ తగిలింది. హెచ్ఎండీఎ లేఅవుట్‌లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలిగించారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్‌ఎండీఎ లేఅవుట్‌లో 2500 గజాల స్థలం ఆక్రమంచి ఆయన సొంత కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు నిర్మించినట్లు గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఫిర్యాదుపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టారు. రహదారిని తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join.
మల్లారెడ్డి గతంలో 2,500 గజాల భూమిని ఆక్రమించి ఈ రోడ్డును నిర్మించారు. తన కాలేజీ కోసం మల్లారెడ్డి ఈ రోడ్డును నిర్మించుకున్నారు. అయితే, ఈ వ్యవహారంపై గతంలో ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ పిర్యాదు పై పెద్దగా చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు రేవంత్ చేతికి రావడం తో..గతంలో చేసిన పిర్యాదు పై ఇప్పుడు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ ఒక్క రోడ్డె కాదు మల్లారెడ్డి అక్రమంగా దోచుకున్న భూములపై ప్రభుత్వం పై చర్యలు చేప్పట్టబోతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో పిర్యాదు దారులు మల్లారెడ్డి పై కేసులు నమోదు చేయడం తో వాటి పై దృష్టి సారించారు.
Read Also : Bollywood Ramayan : బాలీవుడ్ రామాయణం ముహూర్తం ఫిక్స్..!