Priyanka షెడ్యూల్ ఇదే! హైదరాబాద్ సభకు భారీగా జనం తరలింపు
తెలంగాణ కు జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక (Priyanka) గాంధీ రాబోతున్నారు.
- By CS Rao Published Date - 11:29 PM, Sun - 7 May 23
 
                        Priyanka @ Hyderabad: తెలంగాణ కు జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక (Priyanka) గాంధీ రాబోతున్నారు. ఆమె ర్యాలీ, మీటింగ్ కోసం ఎవరికి వారే పోటీ పడి జనాన్ని తరలించే పనిలో ఉన్నారు. ఎవరి బలం ఏమిటో నిరూపించుకొనే పనిలో సీనియర్లు, రేవంత్ రెడ్డి వర్గీయులు ఉన్నారు.
కనుచూపు మేర రేవంత్ రెడ్డి, ప్రియాంక (Priyanka) కటౌట్ లను ప్రదర్శించేలా ఆయన వర్గీయులు స్కెచ్ వేశారు. జనాన్ని అందరూ తరలించి నప్పటికి రేవంత్ హవా కనిపించేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. పీసీసీ షెడ్యూల్ మేరకు ప్రియాంక వాద్రా మే 8వ తేదీన ‘యువ సంఘర్షణ’ ర్యాలీ మరియు సరూర్‌నగర్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ కోసం నగరానికి వచ్చే అవకాశం ఉంది.
మధ్యాహ్నం 3.30 గంటలకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, ఛాపర్‌లో సరూర్‌నగర్‌కు చేరుకుంటారు. మరణించిన కాంగ్రెస్ నేతల కుటుంబాలతో ప్రియాంక గాంధీ 2 లక్షల రూపాయల చెక్కులను అక్కడే అందజేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.తరువాత, ప్రియాంక గాంధీ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ ఆమె ‘యువ సంఘర్షణ’ ర్యాలీ సందర్భంగా రాబోయే ఎన్నికల కోసం యువజన డిక్లరేషన్ ప్రకటన చేసే అవకాశం ఉంది. బహిరంగ సభ తర్వాత, సాయంత్రం 5 గంటలకు, ప్రియాంక గాంధీ ఢిల్లీకి బయలుదేరుతారు.
ఆ మేరకు గాంధీ భవన్‌లో జరిగిన సమావేశం తరువాత, AICC తెలంగాణ ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ఆధ్వర్యంలో షెడ్యూల్ ఖరారు అయింది. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో అధికార బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని, వారికి జరిగిన అన్యాయంపై ప్రియాంక గాంధీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని ఠాక్రే అన్నారు.
యువజన ప్రకటనను బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రకటిస్తారని, యువతకు కాంగ్రెస్‌పై విశ్వాసం ఉందని, తెలంగాణలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, బీఆర్‌ఎస్ పాలక ప్రభుత్వం తొమ్మిదేళ్లలో యువతకు చేసిందేమీ లేదని ఠాక్రే అన్నారు.
రాష్ట్రంలో యువత ఉద్యమం ఆధారంగానే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. యువతకు న్యాయం చేసేలా ప్రియాంక మీటింగ్ బ్లూ ప్రింట్ ఉంది .
 
                    



