HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Telangana
  • ⁄Bhairi Naresh Who Confessed To The Crime

Bhairi Naresh: రిమాండ్ రిపోర్ట్.. నేరం ఒప్పుకున్న భైరీ నరేష్!

అయ్యప్ప స్వామిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన Bhairi Naresh పోలీసుల విచారణలో పలు విషయాలను వెల్లడించాడు

  • By Balu J Published Date - 02:16 PM, Mon - 2 January 23
Bhairi Naresh: రిమాండ్ రిపోర్ట్.. నేరం ఒప్పుకున్న భైరీ నరేష్!

అయ్యప్ప స్వామి (Ayyappa swami), విష్ణువు, శివుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ (Bhairi Naresh) పోలీసుల విచారణలో తన నేరాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. అయ్యప్ప స్వామిపై ఉద్దేశ్యపూర్వకంగానే వ్యాఖ్యలు చేశారని భైరి నరేష్ (Bhairi Naresh) పేర్కొన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే కార్యక్రమ నిర్వాహకుడు హనుమంతు కూడా భైరి నరేష్‌ని ఉద్దేశ్యపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు అంగీకరించారు. డిసెంబర్ 19న అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. గతంలో కూడా భైరి నరేష్‌పై (Bhairi Naresh) పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. మతాలు, దేశాల మధ్య వివాదాలు రెచ్చగొట్టేలా భైరి నరేష్ ఉద్దేశ్యపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారు.

కొడంగల్ లో నిర్వహించిన అంబేద్కర్ సభలో భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు భైరి నరేశ్.. అయ్యప్ప స్వామిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. అతడి వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో అగ్గి రాజేసింది. ఏపీ, తెలంగాణలోని (AP and Telangana) అయ్యప్పస్వామి భక్తులు, హిందూ సంఘాల నేతలు నరేశ్ పై మండిపడ్డారు. మేం నాస్తికులం.. దేవుడిని నమ్మం.. అంబేడ్కర్‌ సభ అంటేనే నాస్తికుల సభ అని బహిరంగంగానే దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు నరేశ్. అయ్యప్ప స్వామి జననాన్ని, పురాణాన్ని కించపరుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఎంతోమంది నమ్మకంగా కొలిచే అయ్యప్పస్వామిని కించపరుస్తూ నరేశ్ మాట్లాడటం దుమారం రేపింది. దీనిపై అయ్యప్పస్వాములు ఆందోళనకు దిగారు. భైరి నరేశ్ ను వెంటనే పీడీ యాక్ట్‌ కింద అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. హిందూ దేవుళ్లను తిట్టడం ప్రతోడికి ఫ్యాషన్ గా మారిందని, హిందువుల దేవుళ్లను దూషిస్తే బాగా పబ్లిసిటీ వస్తుందని కొందరు ఇలా దిగజారిపోతున్నారని అయ్యప్ప భక్తులు (Ayyappa devotees) మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే హిందూ సమాజం ఏకం కావాలన్నారు. దేవుళ్ల గురించి తప్పుగా మాట్లాడిన వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు.

Also Read : Hrithik Roshan 8 pack: హృతిక్ రోషన్ ఎయిట్ ప్యాక్ బాడీని చూశారా!

Telegram Channel

Tags  

  • ayyapa devotees
  • Bairi Naresh
  • hard comments
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Somu Veerraju: ఏపీ ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహిస్తుంది: సోము వీర్రాజు

Somu Veerraju: ఏపీ ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహిస్తుంది: సోము వీర్రాజు

ఇటీవల ఏపీ ప్రభుత్వం దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కుల హోదా కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఏపీ బిజెపి చీఫ్ సోము వీర్రాజు రియాక్ట్ అవుతూ.. ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహిస్తుందని అన్నారు. దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కల్పించాలంటూ శాసనసభలో చేసిన తీర్మానాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. సోమవారం విజయవాడలోని ధర్నా చౌ

  • Bandi Sanjay: కాంగ్రెస్‌కు ‘శని’గా మారిన రాహుల్: బండి సంజయ్

    Bandi Sanjay: కాంగ్రెస్‌కు ‘శని’గా మారిన రాహుల్: బండి సంజయ్

  • Revanth Reddy: సీనియర్లు కేసీఆర్ కు అమ్ముడుపోయారు: రేవంత్ సంచలన వ్యాఖ్యలు

    Revanth Reddy: సీనియర్లు కేసీఆర్ కు అమ్ముడుపోయారు: రేవంత్ సంచలన వ్యాఖ్యలు

  • Mohammed Siraj: ఆస్ట్రేలియన్స్ నన్ను ‘బ్లాక్ మంకీ’ అని దూషించారు: మహ్మద్ సిరాజ్

    Mohammed Siraj: ఆస్ట్రేలియన్స్ నన్ను ‘బ్లాక్ మంకీ’ అని దూషించారు: మహ్మద్ సిరాజ్

  • RRR Oscar Promotions: ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చుపెడుతారా? ఆర్ఆర్ఆర్ పై తమ్మారెడ్డి ఫైర్

    RRR Oscar Promotions: ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చుపెడుతారా? ఆర్ఆర్ఆర్ పై తమ్మారెడ్డి ఫైర్

Latest News

  • Yediyurappa: యడియూరప్ప ఇంటిపై రాళ్ళ దాడి.. అసలేం జరిగిందంటే?

  • Upcoming Movies: ఈవారం ఓటీటీలో సందడి మాములుగా లేదుగా.. ఏకంగా 29 సినిమాలు?

  • Weight Loss Tips: బరువు తగ్గాలంటే కార్బోహైడ్రేట్లు అస్సలు తీసుకోకూడదా? ఏది నిజం?

  • TTD News: మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త!

  • Rahul Disqualified : విప‌క్షాలు ఏకం! కాంగ్రెస్ తో TMC, BRS!!

Trending

    • World Trip in Bus: బస్సులో ప్రపంచ యాత్ర మీకు తెలుసా.. 22 దేశాలు.. 56 రోజులు.. 12 వేల కిలోమీటర్లు

    • Shocking News: సగం ధరకు పడిపోయిన ట్విట్టర్ విలువ

    • Virat Kohli: 9వ తరగతి ఎక్సామ్ లో విరాట్ కోహ్లీపై ప్రశ్న.. వైరల్ వైరల్

    • Bank Holidays in April 2023: ఏప్రిల్ లో 15 రోజులు బ్యాంక్ సెలవులు.. ఎప్పుడెప్పుడు అంటే..!

    • Tejashwi Yadav : తండ్రైన బీహార డిప్యూటీ సీఎం..ఫొటో షేర్ చేసిన తేజస్వీ యాదవ్

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: