Illegal Surrogacy Racket : బిచ్చగాళ్లకు పోర్న్ వీడియోలు చూపించి వీర్యం సేకరణ
Illegal Surrogacy Racket : రోజువారీ కూలీలను లక్ష్యంగా చేసుకుని పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న నిర్వాహకులు, శాంపిల్స్ సేకరించేటప్పుడు అసభ్య వీడియోలు చూపుతూ లైంగిక దృక్కోణంలో మానవ హక్కులను అతిక్రమించినట్లు చెబుతున్నారు
- Author : Sudheer
Date : 29-07-2025 - 8:06 IST
Published By : Hashtagu Telugu Desk
సికింద్రాబాద్‌లోని ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్(Srushti Test Tube Baby Center)లలో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సరోగసీ, ఐవీఎఫ్ పేరుతో పెద్ద ఎత్తున నిబంధనలు ఉల్లంఘిస్తూ వీర్యం, అండాలను సేకరించి శిశువులను వ్యాపారంగా మార్చిన ఘోర చరిత్ర బయటపడింది. రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఉండే బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఇవ్వడంతో పాటు పోర్న్ వీడియోలు చూపించి వీర్యం సేకరించినట్లు సమాచారం. చదువుకున్న యువకులకు రూ.4వేలు వరకు ఇవ్వడం, మహిళల నుంచి అండాలు సేకరించేందుకు రూ.10వేలు నుంచి రూ.25వేలు చెల్లించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ క్లినిక్‌లు ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నట్లు భ్రమలు కల్గించడమే కాకుండా, ఐవీఎఫ్, సరోగసీ పేరుతో శిశువులను పేద దంపతుల నుంచి తక్కువ ధరకే తీసుకుని, సంతాన లేని కుటుంబాలకు లక్షల్లో అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గోపాలపురం పోలీసులు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున రికార్డులు, కేసుల డేటా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 200 మంది దంపతులు ఈ సెంటర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌తో పాటు కూకట్ పల్లి, కొండాపూర్, విజయవాడ, విశాఖ, ఒడిశా, కోల్కతా ప్రాంతాల్లో కూడా ఈ సంస్థ బ్రాంచ్‌లు నడుపుతున్నట్లు గుర్తించారు.
Brain Tumor: బ్రెయిన్ ట్యూమర్ సంకేతాలీవే.. ఇది ఎప్పుడు ప్రమాదకరం అవుతుంది?!
ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థతో సంబంధాలు కలిగిన ఈ కేంద్రాలు యువకులను ఆకర్షించేందుకు వీర్య దానం పై ప్రకటనలు జారీ చేసేవి. రోజువారీ కూలీలను లక్ష్యంగా చేసుకుని పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న నిర్వాహకులు, శాంపిల్స్ సేకరించేటప్పుడు అసభ్య వీడియోలు చూపుతూ లైంగిక దృక్కోణంలో మానవ హక్కులను అతిక్రమించినట్లు చెబుతున్నారు. అహ్మదాబాద్‌కు వీర్యం, అండాలను తరలించడం కూడా ఈ కేసులో కీలక అంశంగా మారింది.
ఇక ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్వయంగా సుమోటోగా కేసు తీసుకుంది. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌తో పాటు అనుబంధంగా ఉన్న క్లినిక్‌లలో జరిగే చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి నుంచి ఆగస్టు 28లోగా సమగ్ర నివేదిక కోరింది. నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం విచారణ కొనసాగిస్తున్నది. ఈ ఘటనలు పేదల ఆరోగ్యాన్ని, గౌరవాన్ని తాకట్టుపెట్టే స్థాయిలో ఉన్నాయని సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.