Telangana : టిక్కెట్లన్నీ రెడ్లకేనా..? మా బీసీల పరిస్థితి ఏంటి..? కాంగ్రెస్ లో కొత్త లొల్లి
బీసీలు ఎప్పుడు పార్టీ జెండాలు మోయడం..ఒకరి కాళ్ల కింద బ్రతకడమేనా..? మాకు పాలించే అధికారం ఇవ్వరా..? పార్టీ టికెట్స్ అన్ని రెడ్లకేనా..? వారే నేతల..మీము కదా..? మాకు ఓ ఛాన్స్ ఇవ్వరా..? ఇంకెన్ని ఏళ్లు ఇలా జెండాలు మోస్తూ మీకు సలాం లు కొట్టాలి..? అంటూ బీసీ నేతలు కాంగ్రెస్ అధిష్టానం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
- By Sudheer Published Date - 05:57 PM, Sat - 7 October 23

కాంగ్రెస్ పార్టీ (Congress Party) అంటేనే నిత్యం ఇదొక వివాదం..ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో అలకలు , బుజ్జగింపులు ఎక్కువ. ఏ రోజు ఏ నేత అలకపాన్పు ఎక్కుతారో తెలియని పరిస్థితి. మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో ఎవరు ఎప్పుడు ఏ బాంబ్ పేలుస్తారో అని అంత ఖంగారుపడుతూ వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ హావ పెరిగిందని..రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టడం ఖాయమని అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇతర పార్టీల నుండి కూడా పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం తో కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అంత సెట్ అని అనుకుంటున్నా సమయంలో ఇప్పుడు బీసీ నేతలు అధిష్టానం ఫై గరం అవుతున్నారు.
బీసీలు (BC) ఎప్పుడు పార్టీ జెండాలు మోయడం..ఒకరి కాళ్ల కింద బ్రతకడమేనా..? మాకు పాలించే అధికారం ఇవ్వరా..? పార్టీ టికెట్స్ అన్ని రెడ్లకేనా..? వారే నేతల..మీము కదా..? మాకు ఓ ఛాన్స్ ఇవ్వరా..? ఇంకెన్ని ఏళ్లు ఇలా జెండాలు మోస్తూ మీకు సలాం లు కొట్టాలి..? అంటూ బీసీ నేతలు కాంగ్రెస్ అధిష్టానం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమ్మ నాయకులకు, రేణుకా చౌదరికి రాహుల్, సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చి తమకు ఇవ్వకపోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలను రెడ్డీలే అడ్డుకుంటున్నారని బీసీ నాయకులు ఫైర్ అవుతున్నారు. అంతే కాదు రాహుల్ గాంధీకి (Rahul Gandhi) అత్యంత సన్నిహితుగా పేరున్న మధుయాష్కీ గౌడ్ కే (Madhu Yashki Goud) టికెట్ రాకుండా కుట్ర జరుగుతోందన్న వాదనలు తెరపైకి తీసుకొచ్చారు. ఈసారి బీసీలకు టిక్కెట్లు ఇవ్వకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమే అని తేల్చి చెపుతున్నారు. మరి అధిష్టానం బీసీల ఆవేదనను పట్టించుకుంటుందా..? లేదా అనేది చూడాలి.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం మాత్రం తెలంగాణాలో ఈసారైనా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అధిష్టానం పక్క ప్రణాళికతో ఉంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీ హామీ పధకాలను ప్రకటించి ప్రజల్లో ఆసక్తి నింపిన కాంగ్రెస్..ఈ ఆరే కాకుండా మరికొన్ని సంక్షేమ పథకాలు అందజేయాలని చూస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు స్కీం కింద రైతులకు ఎకరాకు ఏటా పదివేలు అందిస్తుండగా.. తాము అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.15 వేలు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కౌలు రైతులకు సైతం రైతు బంధు అమలు చేస్తామని హామీ ఇచ్చింది.
బీఆర్ఎస్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ పథకానికి మరో పేరు పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మీ స్థానంలో పసుపు – కుంకుమ అనే పథకం తీసుకురావాలని మేనిఫెస్టో కమిటీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద పెళ్లి కూతురుకు రూ. లక్ష నగదుతో పాటు తులం బంగారం అందించాలని జీవన్ రెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ అంశంపై ప్రస్తుతం సాధ్యాసాధ్యాలను మేనిఫెస్టో కమిటీ పరిశీలన జరుపుతుంది. ఒకవేళ ఇది అందిస్తే మాత్రం కాంగ్రెస్ విజయానికి తిరుగుందని అంటున్నారు.
Read Also : KTR: ఈ నెల 9న తొర్రూరులో కెటిఆర్ సభకు భారీ ఏర్పాట్లు