Pawan Kalyan – Barrelakka : పవన్ కళ్యాణ్ ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బర్రెలక్క
పవన్ సార్ కూడా న్యాయం కోసమే పోరాడుతున్నారు. డబ్బు సంపాదించాలనే ఆశ ఆయనకి లేదు
- By Sudheer Published Date - 11:32 AM, Tue - 5 December 23

బర్రెలక్క (Barrelakka ) ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది..జాబ్ నోటిఫికెషన్స్ రాకపోవడంతో బర్రెలను కాస్తున్న ఫ్రెండ్స్ అంటూ ఈమె చేసిన వీడియో..ఆమెను రాత్రికి రాత్రే పాపులర్ ని చేసింది. ఈ పాపులరే ఆమెను తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections) పోటీ చేసేలా చేసింది. కొల్లాపూర్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి..దాదాపు 7 వేలకు పైగా ఓట్లు సాధించుకుంది. ఎన్నికల్లో ఆమె ఓడిపోయినప్పటికీ..ఆమె ప్రయత్నం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. ఆమె ఓటమి చెందినప్పటికీ..అది ఆమె విజయంగానే అంత భావిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే క్రమంలో కొంతమంది బర్రెలక్క తో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను పోలుస్తున్నారు. బర్రెలక్క కన్నా పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులకు తక్కువ ఓట్లు వచ్చాయని..పవన్ కళ్యాణ్ కన్నా బర్రెలక్క బెటర్ అని ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బర్రెలక్క ..పవన్ కళ్యాణ్ ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ”పవన్ కళ్యాణ్ గారితో నన్ను పోల్చడం సంతోషంగా అనిపిస్తుంది. పవన్ సార్ కూడా న్యాయం కోసమే పోరాడుతున్నారు. డబ్బు సంపాదించాలనే ఆశ ఆయనకి లేదు. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లో ఉన్నారు. ఓటమితోనే గెలుపు వస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బర్రెలక్క చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆమెకు సపోర్ట్‌గా కామెంట్లు చేస్తున్నారు.
Read Also : Divyavani : కాంగ్రెస్ విజయంపై స్పందించిన దివ్యవాణి