HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bandi Sanjay Bus Yatra Will Start Soon In Telangana

Bandi Sanjay Bus Yatra: అధికారమే లక్ష్యంగా బస్సెక్కనున్న ‘బండి’

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

  • Author : Balu J Date : 31-12-2022 - 1:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bandi sanjay bus yatra
Bandi Padayatra

తెలంగాణ (Telangana) బీజేపీ అధికారమే లక్ష్యంగా మరో యాత్రకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్రలతో ప్రజల్లోకి వెళ్లిన బీజేపీ, మరోసారి బస్సు యాత్ర (Bus Yatra) పేరుతో జనాల్లోకి వెళ్లుతోంది. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ఈ యాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 16 నుంచి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) బస్సుయాత్రను ప్లాన్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో బస్సుయాత్ర సందర్భంగా, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరించేందుకు బస్సుయాత్ర సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.

మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించేందుకు బీజేపీ కార్యాచరణ రూపొందిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సుయాత్ర పూర్తయిన తర్వాత పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రానికి చేరుకుని భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో బీజేపీ (BJP) టికెట్ కోసం నలుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారని, తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో రూట్ మ్యాప్ రూపొందించామన్నారు. తెలంగాణలో అత్యధిక లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు నాలుగు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు లక్ష్మణ్ తెలిపారు.

మూడు నెలల్లో వేల సంఖ్యలో మండల, జిల్లా స్థాయి సమావేశాలు ఉంటాయని, జనవరి 20 నుంచి ప్రజా గోస కార్యక్రమంతో ప్రజల్లోకి వెళతామన్నారు. తెలంగాణ సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుంటున్న తీరును ప్రజలకు వివరిస్తామన్నారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులను కేంద్రం లూటీ చేస్తోందని టీఆర్ ఎస్ సర్పంచ్ లు వాపోతున్నారు. బండి సంజయ్ (Bandi Sanjay) ఇప్పటికే పాదయాత్రల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఐదు దశల పాదయాత్ర పూర్తయింది. ఆరో దశ కూడా చేయాలని భావించినా.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారనే సంకేతాలు రావడంతో.. బస్సుయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. బండి సంజయ్ (Bandi Sanjay) ఒంటరిగా ఉంటే తెలంగాణ మొత్తం కవర్ చేయడం కష్టం కాబట్టి.. మరికొందరు సీనియర్ నేతలు కూడా కలిసి మరోమారు బస్సుయాత్ర నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : Aamir Khan Tollywood Entry: క్రేజీ ఆప్డేట్.. టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న అమిర్ ఖాన్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • BJP in Telangana
  • bus yatra
  • hyderabad

Related News

HYDRAA

HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. చెరువు మధ్యలో నిర్మించిన ఆక్రమణలు, గుడిసెలు, కట్టలను అధికారులు తొలగించి చెరువు సరిహద్దులను రక్షించే చర్యలు ప్రారంభించారు. ముష్కిన్ చెరువు పరిసర ప్రాంతాల్లో సుమారు ₹5,500 కోట్ల విలువైన భూమి ఉంది. చెరువు భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు హైడ్రా అధికారులు తనిఖీలు నిర్వహించారు. హెచ్‌ఎండిఏ రికా

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • Gismat Jail Mandi

    Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd