HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bandi Appointed As In Charge Of Kisan Morcha

Bandi Sanjay : బండి సంజయ్ కి కీలక బాధ్యతలు అప్పగించిన బిజెపి అధిష్టానం

  • Author : Sudheer Date : 04-01-2024 - 10:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bandi Sanjay Kisan Incharge
Bandi Sanjay Kisan Incharge

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections ) నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay)కు బీజేపీ అధిష్ఠానవర్గం కీలక పదవి కట్టబెట్టింది. యువమోర్చా ఇన్‌ఛార్జిగా సునీల్ బన్సల్, కిసాన్ మోర్చా ఇన్‌ఛార్జి (Kisan Morcha In Charge)గా బండి సంజయ్ కుమార్‌లను పార్టీ అధిష్ఠానం నియమిచింది. ఇక ఎస్సీ మోర్చా ఇన్‌ఛార్జిగా తరుణ్ చుగ్, మహిళా మోర్చా ఇన్‌ఛార్జిగా బైజ్యంత్ జే పాండా, ఎస్టీ మోర్చా ఇన్‌ఛార్జిగా డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్, ఓబీసీ మోర్చా ఇన్‌ఛార్జిగా వినోద్ తావ్డే, మైనారిటీ మోర్చా ఇన్‌ఛార్జిగా దుష్యంత్ కుమార్ గౌతమ్‌ పేర్లను పార్టీ బుధవారం ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ సంస్థాగత విభాగాలను పునర్‌వ్యవస్థీకరించింది. బుధవారం కీలక విభాగాలకు కొత్త ఇన్‌ఛార్జులను నియమించింది. ఇందులో పార్టీ సీనియర్లుకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ప్రకటన చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని ఆ పార్టీ రాష్ట్ర నేతలు ప్రకటించారు. అయితే అనుహ్యంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగించారు. దీంతో సంజయ్ అసంతృప్తికి గురికాగా.. ఆయన్ను కేంద్రమంత్రి పదవి వస్తుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆయన మంత్రి పదవి ఇవ్వకుండా.. పార్టీలో కేంద్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆశించినతంగా ఫలితాలు రాలేదు. ఆ పార్టీ కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఎమ్మెల్యేలుగా సంజయ్‌తో పాటు కీలక నేతలు ఓడిపోయారు. సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించటంతోనే.. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందనే వాదన తెరపైకి వచ్చింది. సంజయ్ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లి ఉంటే.. కనీసం 30 స్థానాల్లో బీజేపీ గెలిచి ఉండేదని అప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ అయి ఉండేవారని కొందరు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. దీనిని పరిగణలోకి తీసుకున్న బిజెపి అధిష్టానం..బండి సంజయ్ కి కిసాన్ మోర్చా ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు.

Read Also : Petrol Price Reduction : వాహనదారుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • Kisan Morcha in-charge
  • Lok Sabha Election 2024

Related News

The Victim's Mother Responds to Bandi Bhagirath with a Sensational Letter

Bandi Bagheerath: బండి భగీరథ్.. స్పందించిన బాధితురాలి తల్లి సంచలన లేఖ

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై బాధితురాలి తల్లి లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో పలు సంచలన విషయాలను ఆమె వెల్లడించారు. తమది ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబమని, ఎటువంటి రాజకీయ ప్రచారాల కోసం కాకుండా కేవలం తన కుమార్తెకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చామని బాధితురాలి

  • RS Praveen Kumar Challenges Bandi!

    Bandi Sanjay: బండికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్!

Latest News

  • AMCA Fighter Jet Project: పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టు శంకుస్థాపన

  • Byreddy Shabari: వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఫైర్

  • Udhayanidhi Stalin: సనాతన ధర్మం వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ

  • Online NEET Exam: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్‌ పరీక్ష.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

  • AP Government: ట్రాన్స్‌జెండర్ల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుర్తింపు, రేషన్‌ కార్డులు: మంత్రి బాల వీరాంజనేయస్వామి

Trending News

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd