Medical Shops : ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర మెడికల్ షాపులు నిషేధం.. కారణం ఇదే..?
హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ఉన్న మెడికల్ షాపులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, ఫార్మసీల
- By Prasad Published Date - 01:54 PM, Mon - 18 July 22

హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ఉన్న మెడికల్ షాపులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, ఫార్మసీల మధ్య అపవిత్ర బంధం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంటూ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు మూడు కిలోమీటర్ల పరిధిలోని అన్ని మెడికల్ షాపులను సీజ్ చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సిలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సిహెచ్‌సి), ఉప జిల్లా/డివిజనల్ ఆసుపత్రులలో అదే మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, అనేక మంది ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ఫార్మసీల నుండి వైద్య మందులను సూచిస్తున్నట్లు ఆరోగ్య శాఖలోని ఉన్నత వర్గాల సమాచారం.
కొంతమంది వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో ఫార్మసీలను కూడా నిర్వహిస్తున్నారని, రోగులకు ఉచితంగా లభించే మందులను ఆ ఫార్మసీల దగ్గర కోనాలని ఒత్తిడి తెచ్చారని అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవల జనగాం జిల్లా ఆసుపత్రి పరిధిలోని ఫార్మాసిటీ సహా కొన్ని మెడికల్ షాపులను ప్రభుత్వం సీజ్ చేసింది. ఈ నేపథ్యంలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు (ఆర్‌ఎంఓలు), సూపరింటెండెంట్‌లు, ఇతరులతో సహా ఆసుపత్రి యాజమాన్యాలతో హరీష్‌రావు సమావేశమై, ప్రభుత్వ ఆసుపత్రులకు మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రైవేట్ మెడికల్ షాపులను నిర్వహించకూడదనే తమిళనాడు విధానాన్ని అనుకరించాలని వారికి ఆదేశాలు ఇచ్చారు
ఇంకా తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSMSIDC)కి అదనంగా మూడు నెలల మందుల సరఫరాను వాటి గడువు తేదీలను పర్యవేక్షించే బాధ్యతను ఆరోగ్య శాఖ అప్పగించింది. ఔట్ పేషెంట్ డేటాతో పాటు రాష్ట్రంలోని ప్రతి ఆసుపత్రిలో ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని మందుల జాబితాను అప్‌లోడ్ చేయాలని టీఎస్ఎమ్ఎస్ఐడీసీ ని మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రైవేట్‌తో సమానంగా మెరుగుపరిచి మరమ్మతులు చేయాలని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీని ఆదేశించారు.