Bajireddy : బిఆర్ఎస్ ను వీడడం ఫై బాజిరెడ్డి గోవర్ధన్ క్లారిటీ
- Author : Sudheer
Date : 12-03-2024 - 2:02 IST
Published By : Hashtagu Telugu Desk
అసెంబ్లీ ఎన్నికల ముందే కాదు..ఎన్నికల ఫలితాల తరువాత కూడా బిఆర్ఎస్ (BRS) పార్టీ కి వరుస షాకులు తగ్గడం లేదు. పదేళ్ల పాటు కేసీఆర్ (KCR) తో నడిచిన కీలక నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ (Congress) వైపు నడుస్తున్నారు. మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు , మాజీ మేయర్లు ఇలా వారు వీరు కాదు బిఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించినవారంతా ..ఇప్పుడు బిఆర్ఎస్ ను వీడుతూ వస్తున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి (Bajireddy )గోవర్ధన్ సైతం పార్టీ మారుతున్నట్లు ప్రచారం అవుతున్న నేపథ్యంలో వాటిపై క్లారిటీ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
తాను కాంగ్రెస్ నాయకులతో టచ్‌లో ఉన్నట్లు నిజామాబాద్ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం అవుతుంది. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు మూడు సార్లు టికెట్ ఇచ్చారు. తన నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు గెలిపించారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ మారడం అనేది సరికాదు. పార్టీ మారితే బీఆర్ఎస్‌కు ద్రోహం చేసిన వ్యక్తిని అవుతాను. టికెట్ వచ్చినా, రాకున్నా కేసీఆర్ వెంటే తన ప్రయాణం కొనసాగుతోంది. కుట్ర పూరితంగా కొందరు కావాలని దుష్ర్పచారం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయ ప్రస్థానంలో తనకు లైఫ్ ఇచ్చిన వారికి ఇప్పటి వరకు ద్రోహం చేయలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు..అసత్యపు ప్రచారాన్ని నమ్మవద్దంటూ కార్యకర్తలకు తెలియజేసారు.
Read Also : IPL 2024: ఐపీఎల్ నుంచి మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ ఔట్