Girl Saved: బాలికపై అత్యాచారం జరగకుండా కాపాడిన హైదరాబాద్ ఆటో డ్రైవర్
హైదరాబాద్‌లో ఓ బాలికపై అత్యాచారం జరగకుండా ఓ ఆటో డ్రైవర్ కాపాడాడు.
- By Hashtag U Published Date - 12:32 AM, Thu - 25 November 21

హైదరాబాద్‌లో ఓ బాలికపై అత్యాచారం జరగకుండా ఆటో డ్రైవర్ కాపాడాడు. బాలికపై ఒక వ్యక్తి వేధింపులకు ప్రయత్నించడం ఓ ఆటో డ్రైవర్ గమనించాడు. వెంటనే ఇతరులను అప్రమత్తం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
మియాపూర్ కి చెందిన ఒక యాచకురాలు తన పిల్లలతో తనవృత్తిని చేసుకొని, అదే ప్రాంతంలో యాచకవృత్తిని చేసే తన అన్నదగ్గరికి వెళ్ళింది. ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఫుట్ పాత్ దగ్గర పడుకున్న సమయంలో పక్కనే పడుకున్న మరోవ్యక్తి యాచకురాలి చిన్న పిల్లలను తన ఒడిలో కుర్చోపెట్టుకున్నట్టు నటించి ఆ చిన్నారి ప్రయివేట్ పార్ట్స్ తాకుతూ అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆ పరిస్థితిని గమనించిన ఓ ఆటో డ్రైవర్ అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోడ్రైవర్ సయ్యద్ జాహిద్ ధైర్యసాహసాలకు గాను పోలీసు శాఖ రివార్డును అందజేసింది.
This Auto Driver is my Hero of the Day. He saved a child from getting sexually assaulted. Such enlightened citizens make the city of Hyd the best city of India. Pl given your greetings to him. pic.twitter.com/jXf81vZXFz
— Anjani Kumar, IPS (@CPHydCity) November 24, 2021
Related News

Murder Case : అక్రమ సంబంధం కోసం హత్య చేసిన వాలంటీర్.. సుపారీ ఇచ్చి మరీ..
వాలంటీర్ తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ ఆటో డ్రైవర్(Auto Driver) ని హత్య చేయించాడు.