HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Attcak On Mahaa News

Mahaa News : మహాన్యూస్ ఆఫీస్ పై దాడి..లోపల ఫేమస్ హీరో

Mahaa News : ఫోన్ ట్యాపింగ్ వివాదంపై ప్రసారం చేసిన కథనాల్లో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావించడంపై BRS కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు

  • Author : Sudheer Date : 28-06-2025 - 3:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahanewsattack
Mahanewsattack

హైదరాబాద్‌లోని మహా న్యూస్ కార్యాలయం (Mahaa News Office) వద్ద శనివారం ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వివాదంపై ప్రసారం చేసిన కథనాల్లో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావించడంపై BRS కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. వారు ఆగ్రహంతో ఆఫీసు వద్దకు చేరుకుని అద్దాలు పగలగొట్టడం, వాహనాలు ధ్వంసం చేయడం, స్టూడియోలోకి ప్రవేశించి పరికరాలు నాశనం చేయడం వంటి చర్యలకు దిగారు. ఈ అల్లర్ల నేపథ్యంలో మీడియా ప్రతినిధులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

మహా టీవీ ఆఫీస్ పై BRS కార్యకర్తల దాడి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో #ktr పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆఫీస్ అద్దాలు ధ్వంసం చేసి, స్టూడియోను ధ్వంసం చేసిన #BRSParty కార్యకర్తలు. #HashtagU pic.twitter.com/34VU91IB8L

— Hashtag U (@HashtaguIn) June 28, 2025

ఈ దాడి సమయంలో మాహాన్యూస్ స్టూడియోలో ప్రముఖ యువ హీరో సుహాస్ (Suhas) కూడా ఉన్నారు. ఆయన తన తాజా సినిమా ‘ఉప్పు కప్పురంబు’ (Uppu Kappurambu) ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కానీ అకస్మాత్తుగా జరిగిన ఈ ఘర్షణతో ఆందోళన చెందిన సుహాస్, తక్షణమే ఆఫీసు నుంచి బయటకు వెళ్లిపోయారు. ఒక మీడియా సంస్థ ఆఫీసులోనే ఇలాంటి ఉద్రిక్తతలు జరగడం చూసి ప్రజలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఘటనకు సంబంధించి పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తేవడంతో పాటు, అల్లర్లు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛపై మరోసారి ప్రశ్నలు రేపింది. చర్చలు, అభిప్రాయ భేదాల వల్ల ఏర్పడే రాజకీయ అసహనం ఈ స్థాయికి చేరడం ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మీడియా తప్పు చేస్తే న్యాయపరమైన మార్గాలు ఉన్నాయి కానీ హింసతో స్పందించడం ఏ విధంగానూ సమర్థించదగినది కాదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Attcak On Mahaa News
  • BRS Leaders
  • BRS Workers
  • ktr
  • Mahaa News
  • Phone Tapping Case
  • Suhas
  • uppu kappurambu
  • uppu kappurambu hero

Related News

Revanth Speech

CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఉచిత విద్యుత్, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందనితేల్చి చెప్పారు.ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభు

  • KTR- Harish Rao

    BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd