HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Attack On Brs Office Harish Rao Condemned

BRS కార్యాలయంపై దాడి.. ఖండించిన హరీష్ రావు

శనివారం మీడియా సమావేశం సందర్భంగా, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డిపై దాడి చేసి, కార్యాలయ ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు

  • Author : Sudheer Date : 11-01-2025 - 5:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Attack Brs Office
Attack Brs Office

యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం(BRS Office)పై కాంగ్రెస్‌ నేతలు, ఎన్‌ఎస్‌యూఐ నాయకుల దాడి చర్చనీయాంశమైంది. శనివారం మీడియా సమావేశం సందర్భంగా, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డిపై దాడి చేసి, కార్యాలయ ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ఇంకా పార్టీ కార్యకర్తలపైనా దాడి యత్నాలు జరిపారు. ఈ దాడిని బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. పోలీసులు సమక్షంలోనే ఇలాంటి దాడి జరగడం అన్యాయమని, ఇది కాంగ్రెస్‌ నేతల చేతగానితనాన్ని సూచిస్తోందని పేర్కొంది.

Liquor Policy of Delhi : ఢిల్లీ లిక్కర్ పాలసీపై కాగ్ నివేదిక

హరీష్‌రావు (Harish Rao) ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాడులకు దిగడం కాంగ్రెస్‌ దుర్మార్గానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, కానీ దాడుల సంస్కృతిని ప్రోత్సహించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తమ చేతగానితనాన్ని దాచడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy)సీఎమాటలతో కార్యకర్తలు దాడులు చేస్తే, ఆ పార్టీ నాయకులు భౌతిక దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ పాలనలో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక అలజడి నెలకొనడం ఆందోళనకరమని హరీష్‌రావు తెలిపారు. ఇలాంటివి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు. ఇదేనా మీ సోకాల్డ్ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజా పాలన? అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులపై జరుగుతున్న దాడులు ఆ పార్టీ నాయకత్వాన్ని భయపెట్టలేవని హరీష్‌రావు స్పష్టం చేశారు. ఆ పార్టీ బలంగా నిలిచి ప్రజాసమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకత్వం బాధ్యతాయుతమైన వైఖరిని పాటించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ తగిన రీతిలో బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • attack
  • BRS Office
  • harish rao
  • Yadadri-Bhuvanagiri district

Related News

Us Iran Attack

ఇరాన్‌పై యుద్ధ మేఘాలు!

Donald Trump మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌తో అణు ఒప్పందంపై జరిగిన చర్చలు విఫలం కావడంతో, సైనిక చర్యకు దిగేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ వారాంతంలోనే ఇరాన్‌పై దాడులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల కోసం సైన్యం ఎదురుచూస్తోందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అమెరికా తన వైమానిక, నౌకా దళాలను పెద్ద ఎత్త

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

    • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

    • గరిష్ట స్థాయి నుండి చౌకగా మారిన వెండి ధర! ఎంతంటే?!

    • ప్రియురాలితో గడిపేందుకు భర్త కిడ్నాప్‌ వ్యూహం !!

    • మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త!

    Trending News

      • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

      • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

      • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd