HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >As Kcr Aims National Son To Shine At Trs Meet Tomorrow May Get State Charge

KCR-KTR: ప్లీనరీలో కేటీఆర్ కీలకం…కేసీఆర్ ప్లాన్ ఇదేనా..?

టీఆరెస్ పార్టీకి సుప్రీం ఎవరంటే...అది ఖచ్చితంగా ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మాత్రమే.

  • Author : Hashtag U Date : 27-04-2022 - 7:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr ktr
Kcr ktr

టీఆరెస్ పార్టీకి సుప్రీం ఎవరంటే…అది ఖచ్చితంగా ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మాత్రమే. పార్టీలోనూ…ప్రభుత్వంలోనూ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా…ఏ వ్యూహం అమలు చేయాలన్నా అది కేసీఆర్ కు మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారినట్లుగా కనిపిస్తోంది. పార్టీకి సంబంధించినంత వరకు కీలక బాధ్యతలన్నీ కూడా…ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మంత్రి కేటీఆర్ తీసుకుంటున్నారు. అధికారులతో, పార్టీ నాయకులతో కీలకమైన సమీక్షలన్నీ చేపడుతున్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి సారించడంతో…తెలంగాణకు సంబంధించిన అంశాలన్నింటిపై కేసీఆర్ స్థానంలో కేటీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం భాగ్యనగరంలో జరగనున్న టీఆరెస్ 21వ ఆవిర్భావ దినోత్సవంలో ఎన్నికల శంఖారావాన్ని వినిపించేందుకు సిద్దమైంది పార్టీ. ఈ ప్లీనరీలో 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోకసభ ఎన్నికల్లో బీజేపీని ఎలా ఎదుర్కొవాలన్న దానిపై వ్యూహాన్ని రచించనున్నారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. అదే సమయంలో మంత్రి కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న మంత్రి కేటీఆర్ పురపాలక పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ వంటి కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. మీడియాకు ఇంటర్య్వూలు ఇవ్వడం…తమకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు చేయడంలో కేటీఆర్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. విభజన రాజకీయాలు, అభివృద్ధి, ఆస్తులను బుల్డోజింగ్ చేయడం వంటి సమస్యలపై బీజేపీ,కాంగ్రెస్ లను ఎదుర్కొనడంలో కేటీఆర్ ముందున్నారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేటీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ ప్లీనరీ హైటెక్స్ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా మంత్రి కేటీఆర్ చక్కబెడుతున్నారు. మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులకు ఇప్పటికే విభాగాల వారీగా బాధ్యతలను అప్పగించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు కేటీఆర్ ఆధ్వర్యంలో ఇప్పటి నుంచే వ్యూహరచన జరుగుతోంది.

నియోజకవర్గాల వారీగా బలమైన నాయకులను గుర్తించి వారికి కీలక బాధ్యతలను అప్పగించే అంశంలో కేటీఆర్ అన్ని వ్యవహారాలను చూసుకుంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలను చక్కపెడుతుండగా…కేటీఆర్ తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఇదంతా కూడా కేసీఆర్ ముందు చూపు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఎప్పుడో ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్ అప్పగించాల్సి ఉన్నా…ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉండటంతో తన నిర్ణయాన్ని వాయిదా వేశారన్న టాక్ వినిపిస్తోంది. కానీ రానున్న ఎన్నికల్లో టీఆరెస్ విజయం సాధిస్తే కేటీఆర్ ను సీఎంగా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే ఇప్పటి నుంచే పార్టీలోనూ , ప్రభుత్వంలోనూ ప్రజల్లోనూ కీలకమైన నాయకుడిగా కేటీఆర్ ను తీర్చిదిద్దేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి బుధవారం జరిగే ప్లీనరీలో కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తారా…? లేదా అనేది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • ktr
  • trs
  • trs plenary

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

  • Delhi High Court deals a blow to Kavitha.

    TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd