Chandrababu Will Win : ఏపీలో గెలవబోయేది చంద్రబాబే.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
Chandrababu Will Win : టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్టు పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
- Author : Pasha
Date : 17-09-2023 - 3:17 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu Will Win : టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్టు పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అంటే భయం కలిగినందు వల్లే .. జగన్ ఆయనను అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ఆదివారం రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన ‘రజాకార్’ మూవీ టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. ‘‘బంతిని కిందకి ఎంత బలంగా కొడితే అంత బలంగా పైకి లేస్తుంది. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని బలంగా నమ్ముతున్నాను. చంద్రబాబుపై పెట్టిన కేసులు ఫేక్ అని కోర్టు కొట్టేస్తుంది. ఈ అరెస్టు జగన్ కు మైనస్, చంద్రబాబుకు ప్లస్ అవుతుంది’’ అని కామెంట్ చేశారు. ఏపీలో చంద్రబాబు విషయానికి లైన్ క్లియర్ అయినట్టేనని పేర్కొన్నారు.
Also read : Ganesha Idols : వినాయక మట్టి విగ్రహాల తయారీకి ప్రసిద్ధి ఆ గ్రామం…కానీ పట్టించుకోని ఏపీ ప్రభుత్వం
ఇక తెలంగాణలో కూడా చంద్రబాబు సపోర్ట్ గా నిరసనలు జరుగుతున్నాయి. ఇటీవల ఖమ్మం, సత్తుపల్లి, నల్లగొండ జిల్లా కోదాడ, నిజామాబాద్ వంటి చోట్ల ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. ఇక హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు బాబుకు సపోర్ట్ గా నిరసన తెలిపారు. తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల నిరసనను ఉద్యమంలా మార్చేందుకు, పోస్టు కార్డు ఉద్యమం ప్రారంభిస్తోంది. చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ.. రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు పోస్టు కార్డులు పంపాలని ప్రజల్ని టీడీపీ కోరింది. కాగా, చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ మంగళవారం (Chandrababu Will Win) జరగనుంది.