HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Another Complaint To Acb On Ktr Regarding Irregularities In Orr Tenders

KTR Vs ACB : కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు.. ఓఆర్ఆర్ టెండర్లలో క్విడ్‌ప్రోకో జరిగిందని ఆరోపణ

బీఆర్ఎస్ హయాంలో ఓఆర్ఆర్ టెండర్ల కేటాయింపులో  భారీగా అవకతవకలు జరిగాయంటూ తెలంగాణ ఏసీబీకి(KTR Vs ACB) ఫిర్యాదు అందింది. 

  • Author : Pasha Date : 08-01-2025 - 1:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Acb Ktr Orr Tenders Irregularities Yugandhar Goud Bc Political Jac

KTR Vs ACB :  ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ కేసు.. మరోవైపు ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.  ఈ తరుణంలో మరో అంశం తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్ఆర్) టెండర్ల కేటాయింపులో  భారీగా అవకతవకలు జరిగాయంటూ తెలంగాణ ఏసీబీకి(KTR Vs ACB) ఫిర్యాదు అందింది.  దీనిపై ఏసీబీ అధికారులకు బీసీ రాజకీయ జేఏసీ అధ్యక్షుడు యుగంధర్ గౌడ్ లిఖితపూర్వక ఫిర్యాదును ఇచ్చారు. ఓఆర్ఆర్ టెండర్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.  ఓఆర్ఆర్ టోల్ లీజ్‌ టెండర్లలో క్విడ్‌ప్రోకో జరిగిందని యుగంధర్ ఆరోపించారు. ఈ టెండర్ల వ్యవహారంలో కేటీఆర్‌, కేసీఆర్‌లపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు కూడా యుగంధర్ గౌడ్ ఫిర్యాదు ఇచ్చారు.

Also Read : Woman Body Structure : మహిళల శరీరాకృతిపై కామెంట్ చేయడమూ లైంగిక వేధింపే: హైకోర్టు

ఈ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ ఏసీబీ త్వరలోనే చర్యలు మొదలుపెట్టే అవకాశాలు లేకపోలేదు. ఓఆర్ఆర్ నిర్మాణ పనుల టెండర్ల కేటాయింపుపై  విచారణ జరిపించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేస్తామని ఇటీవలే అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ అంశంపై సిట్‌ సమగ్ర దర్యాప్తు చేస్తుందని ఆయన తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లీజుపై విచారణ జరపాలని స్వయంగా బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు కోరటం చాలా మంచి విషయమని రేవంత్ తెలిపారు. దీనిపై అసెంబ్లీలోనే హరీశ్ రావు స్పందిస్తూ  సిట్‌ విచారణను స్వాగతిస్తున్నామని చెప్పారు.

Also Read :CBN Security : సీఎం చంద్రబాబు సెక్యూరిటీలో మార్పులు..ఎందుకో..?

‘‘ఓఆర్‌ఆర్‌, శంషాబాద్‌ విమానాశ్రయం వల్ల తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెరిగింది. గత వైఎస్సార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే తెలంగాణ ముఖచిత్రం మారిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు  ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్ల కోసం బీఆర్ఎస్ సర్కారు లీజుకు ఇవ్వడం వివాదానికి దారితీసింది. అందుకే ఓఆర్ఆర్ లీజు కేటాయింపు టెండర్లపై విచారణ జరుపుతాం’’ అని రేవంత్ ప్రకటించారు. ఫార్ములా ఈ-రేస్ కేసు వ్యవహారంలో ఏ1 నిందితుడిగా  కేటీఆర్ ఉన్నారు. ఆయనను రేపు (గురువారం రోజు) ఏసీబీ విచారించనుంది. ఈనెల 16న ఈడీ విచారించనుంది. రేపు (గురువారం) ఏసీబీ విచారణకు  హాజరయ్యే క్రమంలో తన న్యాయవాదిని తీసుకెళ్లేందుకు అనుమతించాలంటూ హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌ను  దాఖలు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ACB
  • BC political JAC
  • ktr
  • ORR Tenders
  • ORR Tenders Irregularities
  • Telangana ACB
  • Yugandhar Goud

Related News

Phone Tapping Santhosh

ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?

సాక్షులా? నిందితులా? అనే సందేహం ప్రజల్లో బలంగా ఉంది. ప్రస్తుతానికి విచారణకు హాజరవుతున్న రాజకీయ నేతలను సిట్ ప్రాథమికంగా 'సాక్షులు' గానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? సేకరించిన సమాచారాన్ని ఎక్కడ నిక్షిప్తం చేశారు? అనే విషయాలపై స్పష్టత కోసం వీరిని ప్రశ్నిస్తున్నారు

    Latest News

    • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    Trending News

      • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd