Guvvala Balaraju : ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి అటాక్..
అమ్రాబాద్ మండలంలోని కుమొరోనిపల్లిలో బాలరాజు పర్యటిస్తుండగా.. మల్లిపెళ్లను విసిరారు. ఆ మట్టి పెళ్ల గువ్వల బాలరాజుకు తగిలింది
- Author : Sudheer
Date : 14-11-2023 - 3:46 IST
Published By : Hashtagu Telugu Desk
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అచ్చంపేట అభ్యర్థి గువ్వల బాలరాజు (Guvvala Balaraju)పై మరోసారి దాడి (Another Attack) జరిగింది. నాల్గు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలరాజు ఫై రాళ్ల దాడి జరుగగా..సోమవారం మరోసారి దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమ్రాబాద్ మండలంలోని కుమొరోనిపల్లిలో బాలరాజు పర్యటిస్తుండగా.. మల్లిపెళ్లను విసిరారు. ఆ మట్టి పెళ్ల గువ్వల బాలరాజుకు తగిలింది. అయితే, ఈ ఘటనతో షాక్ అయిన బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు దాడి చేసిన వ్యక్తిని పట్టుకొని, పోలీసులకు అప్పగించారు.
We’re now on WhatsApp. Click to Join.
బాలరాజుపై దాడి చేసిన వ్యక్తిని పర్వతాలు (Parvathalu)గా గుర్తించారు పోలీసులు. అయితే పర్వతాలుకు మతిస్థితిమితం లేదని, ఊళ్లో అందరిపై ఇలాగే దాడులు చేస్తుంటాడని పలువురు చెబుతున్నారు. కానీ, ఈ వాదనను బీఆర్ఎస్ శ్రేణులు ఖండిస్తున్నారు. ఈ దాడి ఖచ్చితంగా కాంగ్రెస్ పనే అని ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన దాడికి కొనసాగింపుగానే.. ఇప్పుడు రాళ్లతో అటాక్ చేశారని అంటున్నారు. గువ్వల బాలరాజు కూడా తనపై పడిన మట్టి పెళ్లను చూపిస్తూ.. కాంగ్రెస్ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడిపోతామని తెలిసి దాడులకు తెగబడుతున్న కాంగ్రెస్ గూండాలు
అమ్రాబాద్ మండలం కుమ్మరోళ్లపల్లి గ్రామానికి ప్రచార భాగంలో వెళ్ళిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీద కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఇటిక రాయితో దాడి చేశారు.
ప్రజాక్షేత్రంలో ధైర్యంగా ఎదుర్కోలేక ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్న… pic.twitter.com/tfeWBTAunA
— BRS Party (@BRSparty) November 13, 2023
Read Also : Thummala : తుమ్మల సంచలన కామెంట్స్..నేను గెలిస్తే ఏపీలో బాబు గెలిచినట్లే..