TG Skill University Chairman : తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా
తెలంగాణ నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ఈ యూనివర్సిటిని ఏర్పాటు చేస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో తెలిపారు
- By Sudheer Published Date - 04:24 PM, Mon - 5 August 24

తెలంగాణ నిరుద్యోగ యువత కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం స్కిల్ యూనివర్శిటీ ( TG Skill University )ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసింది. ఆగష్టు 1న రంగారెడ్డి జిల్లాని ముచ్చెర్లలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) శంకుస్థాపన చేశారు. తెలంగాణ నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ఈ యూనివర్సిటిని ఏర్పాటు చేస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో తెలిపారు. యువతకు ఉపాధితో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా స్కిల్ వర్సిటీకి ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రాను ఛైర్మన్ నియమిస్తున్నట్లు అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ ప్రకటించారు. యువత వద్ద కేవలం సర్టిఫికెట్లు మాత్రమే ఉంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకడం కష్టంగా మారిందనే విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం.. పోటీ ప్రపంచానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతోంది. యూనివర్సిటీలో యువతకు సాంకేతిక నైపుణ్యాలు నేర్పించనున్నారు.
ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా న్యూజెర్సీలో ఎన్నారైలతో సమావేశం సందర్భంగా ప్రకటించారు. తొలిసారిగా పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, యువతకు వివిధ ట్రేడ్‌లలో స్కిల్స్ నేర్పించడంతో కోర్సు ముగిసిన వెంటనే ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. ఈ యూనివర్శిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరించాల్సిందిగా ఆనంద్ మహింద్రాను కోరానని, రెండు మూడు రోజుల్లో రిప్లై ఇస్తానంటూ ఆయన సానుకూలంగా స్పందించారని గుర్తుచేశారు. మరో రెండు మూడు రోజుల్లో ఆయనే చైర్‌పర్సన్‌గా తన సమ్మతిని తెలియజేయనున్నట్లు సీఎం రేవంత్ ఆ వేదిక ద్వారా ప్రకటించారు.
Read Also : Food Rules : 60 ఏళ్ల దాకా ఒక లెక్క.. 60 ఏళ్ల తర్వాత మరో లెక్క.. !!