KCR Deeksha Divas: తెలంగాణ చరిత్రలో అపూర్వ ఘట్టం ‘దీక్షా దివస్’
తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమ నాయకుడు,
- Author : Balu J
Date : 29-11-2022 - 10:52 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమ నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా నవంబర్ 29, 2009న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షా దివస్ కు నేటితో 12 ఏళ్లు. తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు.
ఉమ్మడి పాలనలో కొందరు ఆంధ్ర పాలకులు ఢిల్లీ నాయకులకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని కుట్రలు చేసి రాష్ట్ర సాధన ఉద్యమాన్ని అణిచివేయాలని కుట్రలు పన్నినా, మొక్కవోని దైర్యం తో ఎలాంటి హింసకు తావు లేకుండా అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధనకు తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి, స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన కార్యసాధకులు కేసిఆర్. నాడు ఆయన చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ చరిత్రలో అపూర్వ ఘట్టంగా నిలిచింది.
చిరకాల స్వప్నం కంటే తన ప్రాణం గొప్పది కాదని కేసీఆర్ తో పాటు తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారు. ఒక ప్రత్యేక కారణం కోసం పదవులను గడ్డిపోచతో సమానంగా వదిలి, తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి 14 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించడంలో సక్సెస్ అయ్యారు చంద్రశేఖరుడు. ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలను వారి సమస్యలను దగ్గరగా చూసిన కేసీఆర్ తన పాలనలో అన్ని వర్గాలను అక్కున చేర్చుకొని సుపరిపాలన అందిస్తున్నారని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు నాటి దిక్షా దివాస్ ను గుర్తు చేసుకుంటున్నారు.
మీ పోరాటం అనితర సాధ్యం 🙏
ఒక నవశకానికి నాంది పలికిన రోజు
ఒక బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేలు కొలిపిన రోజు
తెలంగాణ వైపు దేశం దృష్టి మరల్చే విధంగా తెగించిన రోజు
చరిత్రను మలుపు తిప్పిన రోజు 29th Nov, 2009. తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు
దీక్షా దివస్ #DeekshaDivas pic.twitter.com/ehzGByfGAp
— KTR (@KTRBRS) November 29, 2022
తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు..
కేసీఆర్ గారి చారిత్రాత్మక దీక్షకు 12 ఏళ్ళు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మన ఉద్యమ నేత కేసీఆర్ గారు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్షకు దిగి తన ఉక్కు సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు.#దీక్షాదివస్#DeekshaDivas pic.twitter.com/9rOdfJujLU— Harish Rao Thanneeru (@BRSHarish) November 29, 2022
కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, 'తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ సచ్చుడో' అంటూ, ప్రాణాలను పణంగా పెట్టి, సమైక్య పాలకుల నిర్బంధాలను ఛేదించి, సిద్దిపేట కేంద్రంగా ఉద్యమ వీరుడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన చారిత్రక రోజు…నవంబర్ 29, దీక్షా దివాస్
1/2 pic.twitter.com/OsyOKylOgz
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 29, 2022