Youtube: యూట్యూబ్ లో 5 అద్భుతమైన ఫీచర్లు.. ఇంటర్నెట్ లేకుండా కూడా పనిచేస్తాయట!
యూట్యూబ్ లో ఉండే ఐదు రకాల అద్భుతమైన ఫీచర్లు ఇంటర్నెట్ లేకపోయినా కూడా పనిచేస్తాయని చెబుతున్నారు టెక్ నిపుణులు.
- By Anshu Published Date - 10:00 AM, Fri - 31 January 25

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగిస్తున్న అతి పెద్ద వీడియో ఫ్లాట్ ఫారం యూట్యూబ్. చాలామంది యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు లక్షల సంపాదిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో యూట్యూబ్ ఛానల్ అన్నది ట్రెండింగ్ గా మారిపోయింది. ఇకపోతే వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడం కోసం యూట్యూబ్ ఛానల్ ఇప్పటికే ఎన్నో కొత్త కొత్త ఫీచర్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటితో పాటుగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది యూట్యూబ్ సంస్థ. అందులో భాగంగానే ఇటీవల యూట్యూబ్ ప్రీమియం వినియోగదారుల కోసం 5 కొత్త, అద్భుతమైన ఫీచర్ లను పరిచయం చేసింది. ఇది వినోదాన్ని సులభతరం చేయడం మాత్రమే కాకుండా సాంకేతికతను ఉపయోగించడంలో మెరుగైన అనుభవాన్ని అందిస్తుందట. ఇంతకీ ఆ ఫీచర్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. యూట్యూబ్ ప్రీమియం వినియోగదారుల కోసం 256kbps బిట్‌రేట్ వద్ద ఆడియో మద్దతు ఫీచర్ ను జోడించింది. దీనితో సంగీతం, వీడియోల సౌండ్ అవుట్ పుట్ గతంలో కంటే మెరుగ్గా మారింది. ఈ ఫీచర్ ఇప్పటికే యూట్యూబ్ మ్యూజిక్ లో అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు ఇది యూట్యూబ్ వీడియోలలో కూడా అందుబాటులోకి వచ్చింది.
మరొక ఫీచర్ పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్… యూట్యూబ్ షార్ట్ లను ఇప్పుడు పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ లో వీక్షించవచ్చు. ఈ ఫీచర్ మీకు మల్టీ టాస్కింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. మీరు మరొక యాప్ లో పని చేస్తున్నప్పుడు షార్ట్స్ ని ఆస్వాదించవచ్చట. ఈ అద్భుతమైన ఫీచర్ నీ వినియోగదారుల కోసం తీసుకువచ్చింది యూట్యూబ్ సంస్థ.
యూట్యూబ్ తీసుకువచ్చిన మరొక ఫీచర్ ఆఫ్‌లైన్ చిత్రాలు.. ఐఓఎస్ వినియోగదారుల కోసం యూట్యూబ్ ఆటోమేటిక్ డౌన్‌లోడ్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా లఘు చిత్రాలను చూడవచ్చట. ఇంటర్నెట్ లేకపోవడం వల్ల కంటెంట్ ను చూడలేని వ్యక్తులకు ఈ ఫీచర్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుందట.
ఆస్క్ మ్యూజిక్ ఫీచర్.. యూట్యూబ్ మ్యూజిక్‌లో ఆస్క్ మ్యూజిక్ ని ఫీచర్ పరిచయం చేసిందట. ఈ ఫీచర్ సహాయంతో మీరు కేవలం ఒక వాయిస్ కమాండ్ తో నిర్దిష్ట మ్యూజిక్ ను సెర్చ్ చేయవచ్చట. అలాగే ప్లే చేయవచ్చని చెబుతున్నారు.
మరో ఫీచర్ చాట్ ఫీచర్.. ఐఫోన్ వినియోగదారుల కోసం ఆస్క్ చాట్ బటన్ కూడా జోడించింది. దాని సహాయంతో మీరు వీడియోలో చూపిన కంటెంట్ కు సంబంధించిన ప్రశ్నలను అడగవచ్చు. ఈ కొత్త ఫీచర్లు యూట్యూబ్ ప్రీమియంని మరింత ఆకర్షణీయంగా, ఉపయోగకరంగా చేస్తాయి. అధిక నాణ్యత గల ఆడియో PiP మోడ్, ఆఫ్‌లైన్ షార్ట్‌లు వంటి ఫీచర్లు వినోదాన్ని సులభతరం చేయడమే కాకుండా వినియోగదారులకు మెరుగైన సాంకేతిక అనుభవాన్ని అందిస్తాయట.