రైతన్నలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది – బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్
Alleti Maheshwar Reddy : రాహుల్ గాంధీ సమక్షంలో అధికారంలోకి రావడానికి ప్రతీ సంవత్సరం దాదాపు 81 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇచ్చిన హామీలను మర్చిపోయారా..? లేక మర్చిపోయినట్లు నటిస్తున్నారా..?
- By Sudheer Published Date - 03:52 PM, Mon - 30 September 24

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అమలు కానీ హామీలిచ్చి, రైతన్నలను మోసం చేసిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి .. ఇందిరాపార్కు ధర్నాచౌక్ (Dharnachowk to Indira Park) వద్ద బీజేపీ ‘రైతు హామీల సాధన దీక్ష’ (Rythu Hamila Sadhana Deeksha) చేపట్టింది. 24 గంటల పాటు కొనసాగనున్న ఈ దీక్షలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మహేశ్వర్ రెడ్డి (Eleti Maheshwar Reddy) మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అమలు కానీ హామీలిచ్చి, రైతన్నలను మోసం చేసిందని , ఆనాడు వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో అధికారంలోకి రావడానికి ప్రతీ సంవత్సరం దాదాపు 81 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇచ్చిన హామీలను మర్చిపోయారా..? లేక మర్చిపోయినట్లు నటిస్తున్నారా..? లేదంటే మొత్తానికే గజినీలా మారిపోయారా అని ఎద్దేవారు చేసారు.
ఒకే సంతకంతో 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, ఈ రోజు 17 వేల 933 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారని, అంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసి, రెండవ వంతు రైతాంగాన్ని మోసం చేశారని తెలిపారు. అలాగే మీరు ఇస్తా అని చెప్పిన రైతు బంధు, రైతు కూలీలకు డబ్బులు, కౌలు రైతులకు న్యాయం హామీలు ఎక్కడికి పోయాయని, దీనివల్ల దాదాపు వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలని డిమాండ్ చేసారు. గత నెల 15 వరకు 870 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని నివేదికలు చెబుతుండగా.. ఈ రోజు వరకు 1000 మంది ఆత్మహత్య చేసుకున్నారని, అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతుల ఓట్లతో గద్దెనెక్కి వాళ్లనే మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న హీరో కార్తీ