Government Contracts: కాంట్రాక్టులన్నీ ఆ ఇద్దరికే – కేటీఆర్
Government Contracts : కాంట్రాక్టులపై (Contracts) కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని, రాష్ట్రంలో కాంట్రాక్టులన్నీ సీఎం రేవంత్ బామ్మర్దితో పాటు మంత్రి పొంగులేటి కంపెనీలకే
- By Sudheer Published Date - 01:09 PM, Wed - 6 November 24

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) ..కాంగ్రెస్ సర్కార్ పై తన దూకుడు ను ఏమాత్రం తగ్గించడంలేదు. రోజు రోజుకు విమర్శల పర్వం పెంచుకుంటూ వెళ్తున్నారు. తాజాగా కాంట్రాక్టులపై (Contracts) కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని, రాష్ట్రంలో కాంట్రాక్టులన్నీ సీఎం రేవంత్ బామ్మర్దితో పాటు మంత్రి పొంగులేటి కంపెనీలకే (Ponguleti Companies) కట్టబెడుతున్నారని ఆరోపించారు. అప్పట్లో మేఘా ఇంజనీరింగ్ సంస్థ (Megha Engineering Company) ను ఈస్ట్ ఇండియా కంపెనీ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడారని..ఇప్పుడు ఎందుకు ఆ కంపెనీ పై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
సుంకిశాలలో మేఘా కంపెనీ క్రిమినల్ నెగ్లిజన్స్ కారణంగా రిటైనింగ్ వాల్ కూలిపోయిందని , ఈ విషయాన్ని అసలు బయటకు తెలియకుండా ముఖ్యమంత్రి సహా ప్రభుత్వం దాచి పెట్టిందని మండిపడ్డారు. మేడిగడ్డ ఘటనతో కాళేశ్వరంలో లక్ష కోట్లు నీళ్లలో పోశారంటూ ప్రచారం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్లు ఈ ప్రమాదాన్ని మాత్రం దాచి పెట్టారని అన్నారు. మొత్తం సంఘటనలో నలుగురు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని.. అంతేకానీ కంపెనీని బ్లాక్ చేయలేదని అన్నారు.
దొంగలు, దొంగలు కలసి ఊళ్లు పంచుకున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మేఘా సంస్థ కు రాష్ట్రంలోని ప్రాజెక్ట్ లను కట్టబెడుతున్నారని విమర్శించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ. 4350 కోట్ల టెండర్‌ను మేఘా సంస్థకు అప్పగించావని.. బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని చెప్పిన సంస్థకు ఎందుకు కాంట్రాక్ట్ కట్టబెట్టావని ప్రశ్నించారు. సుంకిశాల ప్రాజెక్ట్ విషయంలో మేఘా సంస్థ పై చర్యలు తీసుకొని కాంట్రాక్ట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పెద్ద కుంభకోణమే అని. దానిని కూడా రద్దు చేయాలన్నారు. కేవలం మేఘా, పొంగులేటి కి చెందిన రాఘవ సంస్థ కు మొత్తం పనులను రెండు కేకుల మాదిరిగా ముక్కలు ఇచ్చారని అన్నారు. మేఘా సంస్థతో కుమ్మక్కై డబ్బులు దండుకునే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
Read Also : YSRCP: కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి వైసీపీ నయా స్ట్రాటజీ..