BRS 25th Anniversary : కేసీఆర్ స్పీచ్ పైనే అందరి దృష్టి
BRS 25th Anniversary : ఈరోజు సాయంత్రం 5 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సభ ప్రాంగణానికి చేరుకుని తన ప్రసంగం ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.
- By Sudheer Published Date - 09:27 AM, Sun - 27 April 25

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో స్థాపించిన టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) తన 25వ పుట్టిన రోజు(BRS 25th Anniversary)ను వరంగల్‌లో అద్భుతంగా జరుపుకోనుంది. గులాబీ పార్టీ రజతోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు సంపూర్ణంగా పూర్తయ్యాయి. ఎల్కతుర్తి కూడలిలో 1,213 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేయగా, 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. లక్షకు పైగా కుర్చీలు, భారీ వేదికలు, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు, కళాకారుల ప్రదర్శన వేదికతో సభా ప్రాంగణం ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
కేసీఆర్ ప్రసంగంపై అందరి దృష్టి
ఈరోజు సాయంత్రం 5 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సభ ప్రాంగణానికి చేరుకుని తన ప్రసంగం ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏడాది పాటు సాగనున్న కార్యక్రమాలకు అంకురార్పణగా ఈ సభను నిర్వహిస్తున్నారు. సభ కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం, 23 ఎల్‌ఈడీ తెరల ఏర్పాటు వంటివి కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా అందరికీ అందించేందుకు చేసిన ఏర్పాట్లను ప్రతిబింబిస్తున్నాయి. ఒక్కరితో మొదలై కోట్లాది మంది ఆకాంక్షలను నెరవేర్చిన గులాబీ జెండా 25 ఏళ్ల ఘనతను సాధించిందని కేటీఆర్ పేర్కొన్నాడు.
KKR vs PBKS: పంజాబ్- కోల్‌కతా మ్యాచ్ వర్షార్పణం.. ఇరు జట్లకు చెరో పాయింట్!
రజతోత్సవ సభ అనంతరం, రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అదే విధంగా వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేయడం, కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉద్యమ ప్రేరణను కొనసాగిస్తూ, పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఏడాది పూర్తి స్థాయిలో వివిధ కార్యక్రమాలను అమలు చేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఉద్యమ పార్టీగా..
ప్రత్యేక తెలంగాణను సాధించి..అధికార పార్టీగా..
ఉజ్వల తెలంగాణను ఆవిష్కరించి..ప్రతిపక్ష పార్టీగా..
ప్రజల పక్షాన సమరశంఖం పూరించి..తెలంగాణ సమాజమిచ్చిన ప్రతి బాధ్యతను
ఓ పవిత్ర యజ్ఞంలా.. ప్రతిక్షణం యుద్ధంలా..
అకుంఠిత దీక్షతో, పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తూ…… pic.twitter.com/iG9n4nbYnP— KTR (@KTRBRS) April 27, 2025
I wholeheartedly thank Hari Prasad Garu from Siricilla, an extremely talented artist who weaved this beautifully crafted piece for KCR Garu 🙏#25YearsOfBRS #BRSat25 pic.twitter.com/nRjBff2Bx9
— KTR (@KTRBRS) April 27, 2025