Ramesh Rathod : మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్(59) ఇక లేరు.
- By Pasha Published Date - 02:11 PM, Sat - 29 June 24

Ramesh Rathod : ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్(59) ఇక లేరు. ఆయన ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకొస్తుండగా మార్గం మధ్యలో ఇచ్చోడ వద్ద తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని ఉట్నూర్‌కు తరలించారు. అంతకుముందు శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో రమేష్ రాథోడ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతుండగా ఆరోగ్యం విషమించింది.అక్కడి నుంచి రమేష్ రాథోడ్‌ను హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా ఇచ్చోడ వద్ద కన్నుమూశారు. ఆయన మృతి పట్లు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join
- రమేష్ రాథోడ్ ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం తాడిహత్నూర్‌లో 1966 అక్టోబరు 20న జన్మించారు.
- ఆయన ప్రాథమిక విద్య నార్నూర్ మండలంలోని జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగింది.
- ఉట్నూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు.
- ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ (బీఏ) చేశారు.
- రమేష్ రాథోడ్ టీడీపీలో చేరి నార్నూర్ జెడ్పీటీసీగా గెలిచారు.
- 1999లో ఖానాపూర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా రమేష్ రాథోడ్ (Ramesh Rathod) గెలిచారు.
- 2009లో టీడీపీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు.
- తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లోకి చేరారు.
- అనంతర పరిణామాల్లో కాంగ్రెస్‌లో చేరారు.
Also Read : Nitish – Modi : మోడీ సర్కారుకు నితీశ్ మెలిక.. ఆ ‘హోదా’ కోసం తీర్మానం!
- 2018లో ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.
- రమేష్ రాథోడ్ 2019లో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయగా ఓటమి ఎదురైంది.
- అనంతరం బీజేపీలో చేరారు.
- గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు.
- ఇటీవలే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు.