Sharat Kumar Met Kavitha: కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ!
సినీ నటుడు శరత్ కుమార్ (Sharat Kumar) కవిత (MLC Kavitha)తో భేటీ అయ్యారు.
- Author : Balu J
Date : 28-01-2023 - 11:42 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ : ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు, సినీ నటుడు శరత్ కుమార్ (Sharat Kumar) శనివారం ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలపై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు లక్ష్యాలు , ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్ (Sharat Kumar) అడిగి తెలుసుకున్నారు. ఏపీతో పాటు పొరుగున్న ఉన్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరించే ప్లాన్‌లో కేసీఆర్ ఉన్నారు.
ఇప్పటికే కర్ణాటకకు చెందిన పలువురు బీఆర్ఎస్ (BRS Party) తీర్థం పుచ్చుకున్నారు. నిన్న కేసీఆర్ సమక్షంలో ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా.. తమిళనాడుకు చెందిన ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు, సినీ నటుడు శరత్ కుమార్ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ ఉదయం కవితను మర్యాదపూర్వకంగా కలుసుకున్న శరత్ కుమార్ (Sharat Kumar).. దేశ రాజకీయాలపై చర్చించారు.
Also Read: Dhoni Entertainment’s: ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్ తొలి చిత్రం ‘ఎల్‌జిఎం’ షురూ!