Medaram : ఆధార్ కార్డు ఉంటేనే ‘బంగారం’ అమ్మబడును
- Author : Sudheer
Date : 06-02-2024 - 3:35 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణా (Telangana)లో జరిగే అతిపెద్ద, విశిష్ట గిరిజన జాతర మేడారం (Medaram) సమ్మక్క-సారలమ్మల జాతర. ఈ జాతర రెండు ఏండ్లకు ఒక సారి జరుగుతుంది, సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా జరుపుతూ వస్తుంది. ఈ ఏడాది ఈ మహాజాతర జరగనుంది. ఫిబ్రవరి లో 21 నుంచి 24వ తేదీ వరకు జాతర జరగబోతుంది. ఇప్పటికే వేలాదిమంది భక్తులు మేడారం కు చేరుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణ మంత్రులు సైతం అక్కడి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరివేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటె ఈసారి మేడారం వెళ్లి భక్తులు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. మేడారం జాతరకు వచ్చే భక్తులకు అధికారులకు కొన్ని ఆంక్షలు కూడా పెట్టారు. సమ్మక్క-సారలమ్మకు నిలువెత్తు బంగారం (బెల్లం) ఇచ్చి మెుక్కు తీర్చుకోవాలంటే కచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిందే అంటున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించే భక్తుల వివరాలను తప్పనిసరిగా సేకరించాలని… వ్యాపారులకు ఆదేశాలు జారీ చేసింది ఎక్సైజ్ శాఖ. నిలువెత్తు బెల్లం కొనుగోలు చేసే… భక్తుల నుంచి ఆధార్, ఫోన్ నెంబర్, అవసరమైతే ఇంటి అడ్రస్ తీసుకోవాలని తెలిపింది. వివరాలన్నీ ఇచ్చిన భక్తులకే బెల్లాన్ని విక్రయించాలని వ్యాపారులకు హుకుం జారీ చేశారు. జాతర పేరుతో కొందరు అక్రమార్కులు బెల్లాన్ని గుడుంబా(సారా) తయారీ కోసం పక్కదారి పట్టించే అవకాశం ఉండటంతో… ఈ నిబంధన పెట్టామంటున్నారు ఎక్సైజ్ అధికారులు. జాతరలో మెుక్కలు చెల్లించుకునేందుకు ఉపయోగించే బెల్లాన్ని.. గుడుంబా తయారీ కోసం విక్రయిస్తే లక్ష రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
Read Also : KCR : ఈ నెల 13న నల్లగొండలో బిఆర్ఎస్ భారీ బహిరంగసభ