HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >A Big Shock For Brs Former Mla Goodbye

Shock To BRS: బీఆర్ఎస్‌కు షాక్‌.. మాజీ ఎమ్మెల్యే గుడ్ బై !

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు ఆదిలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ షాక్ తగిలింది.

  • Author : Hashtag U Date : 06-10-2022 - 5:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Whatsapp Image 2022 10 06 At 5.37.52 Pm
Whatsapp Image 2022 10 06 At 5.37.52 Pm

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు ఆదిలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ షాక్ తగిలింది. పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సెప్టెంబర్ 9న బీజేపిలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడైన ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రాజయ్య యాదవ్ బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

గురువారం పరకాలలో మాజీ ఎమ్మెల్యే బిక్షపతి మీడియా సమావేశం నిర్వహించి ఈ నెల 9వ తేదీన బీజేపీలో చేరనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ నుంచి బిక్షపతి చురుకైన పాత్ర పోషించారు. గతంలో పరకాల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా, పరకాల జెడ్పీటీసీగా పని చేశారు. 2009 శాసనసభ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో మాజీ మంత్రి కొండా సురేఖ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల పరకాల నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో బిక్షపతి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

కొన్నేళ్ల నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న బిక్షపతి ఇప్పుడు అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ గూటికి చేరేందుకు నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న బిక్షపతి సన్నిహితుల్లో కొందరు కూడా మొలుగురి వెంట బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే మొలుగురి బిక్షపతి కొద్ది రోజుల క్రితం బీజేపీ చేరికల కమిటీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కలిసి బీజేపీలో చేరడంపై చర్చలు జరిపినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో బిక్షపతి టీఆర్ఎస్‌ను వీడటం చర్చనీయమైంది. సమావేశంలో బిక్షపతి వెంట పరకాల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ రాజభద్రయ్యతో పాటు మరికొందరు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • Ex MLA
  • Goodbye
  • warangal

Related News

Errabelli Dayakar Rao

కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

Errabelli Dayakar Rao  తొర్రూరులో జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తీరును చూశాక రాజకీయాల్లో ఉండాలా, వద్దా అనేది అర్థం కావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరులో 16 వార్డులకు గాను 9 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ఎక్స్అఫీషియో ఓట్లతో కలిపి రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. దీంతో లాటరీ తీయడంతో కాంగ్రెస్ రెండో వార్డ

  • Karimnagar Mayor As Kolagani Srinivas

    కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ

Latest News

  • టీమ్ ఇండియా విజయ యాత్రకు బ్రేక్.. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం!

  • త‌మ పెళ్లిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విజ‌య్‌- ర‌ష్మిక‌!!

  • మీకు ఈ అల‌వాటు ఉందా? అయితే జుట్టుకు న‌ష్ట‌మే!

  • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

  • ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ బీపీ పెరిగినట్లే!

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

    • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

    • గరిష్ట స్థాయి నుండి చౌకగా మారిన వెండి ధర! ఎంతంటే?!

    • మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త!

    • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd