IB Jobs – 677 : ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 జాబ్స్.. ఏపీ, తెలంగాణలోనూ పోస్టులు
IB Jobs - 677 : ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్ చేయాలని ఉందా ? అయితే ఇదే మంచి అవకాశం.
- By Pasha Published Date - 03:45 PM, Wed - 11 October 23
IB Jobs – 677 : ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్ చేయాలని ఉందా ? అయితే ఇదే మంచి అవకాశం. 677 సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్పోర్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు. 362 సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్పోర్ట్ పోస్టులు ఉండగా.. వీటిలో ఏపీలో 5, తెలంగాణలో 7 ఉన్నాయి. 315 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉండగా.. వీటిలో ఏపీలో 10, తెలంగాణలో 10 ఉన్నాయి. సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 27 సంవత్సరాలలోపు, మల్టీటాస్కింగ్/జనరల్ పోస్టులకు 18-25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. పదోతరతగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉన్నవారు ఈ జాబ్స్ కు అర్హులు. డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. మోటార్ మెకానిజం నాలెడ్జ్ కలిగి ఉండాలి.అక్టోబరు 14 నుంచి నవంబరు 13 వరకు ఈ పోస్టులకు ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్థులు రూ.50 చెల్లిస్తే చాలు.
We’re now on WhatsApp. Click to Join
ఇంటెలిజెన్స్ బ్యూరో జాబ్స్ కోసం టైర్-1, టైర్-2 రాతపరీక్షల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. 100 మార్కులకు టైర్-1 పరీక్ష ఉంటుంది. ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ పై 40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ పై 20, న్యూమరికల్/అనలిటికల్/లాజికల్ ఎబిలిటీ & రీజనింగ్ పై 20 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానిక 0.25 మార్కులు కోత విధిస్తారు. టైర్-2 ఎగ్జామ్ 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో సెక్యూరిటీ అసిస్టెంట్, మోటార్ ట్రాన్స్పోర్ట్ పోస్టులకు డ్రైవింగ్ టెస్ట్ కమ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనికి కనీస అర్హత మార్కులు 40 శాతం. ఎంటీఎస్ పోస్టులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ (ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్) నిర్వహిస్తారు. దీనికి కనీస అర్హత మార్కులు (IB Jobs – 677) 20 శాతం.
Also read : IT Raids : ‘టైగర్ నాగేశ్వర్ రావు’ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు
Tags
Related News
Sundar Pichai : టాప్ టెక్ జాబ్స్ కోసం ‘త్రీ ఇడియట్స్’ ఫార్ములా : సుందర్ పిచాయ్
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. ఒక లెజెండ్. సామాన్య కుటుంబం నుంచి దిగ్గజ కంపెనీ సీఈఓ స్థాయికి ఆయన ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం.