Manuscripts: తాళపత్ర గ్రంధాలన్నీ ఇక డిజిటల్ రూపంలో
ప్రాచీన చరిత్ర తెలుసుకోవడానికి అనేకమార్గాలున్నాయి. వాటిలో ఆ కాలంలో రాసిన పుస్తకాలు, వ్రాత ప్రతుల ద్వారా ఆ కాలంలోని పరిస్థితులు తెలుసుకోవడం ఒక పద్దతి. దీన్ని మానుస్క్రిప్ట్స్ అని అంటారు. వీటిలోని సమాచారమంతా చేతిరాత లోనే ఉంటుంది.
- By Hashtag U Published Date - 03:28 PM, Sun - 23 January 22

ప్రాచీన చరిత్ర తెలుసుకోవడానికి అనేకమార్గాలున్నాయి. వాటిలో ఆ కాలంలో రాసిన పుస్తకాలు, వ్రాత ప్రతుల ద్వారా ఆ కాలంలోని పరిస్థితులు తెలుసుకోవడం ఒక పద్దతి. దీన్ని మానుస్క్రిప్ట్స్ అని అంటారు. వీటిలోని సమాచారమంతా చేతిరాత లోనే ఉంటుంది. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం అప్పటి వివాహయాలను నమోదు చేయడానికి తాటి ఆకులను కత్తిరించి పుస్తకాలుగా తయారు చేసేవారు.
ప్రాచీన కాలం నాటి తాళపత్ర గ్రంధాలు, మానుస్క్రిప్ట్స్ లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విరివిగా ఉన్నాయి. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2003లో ప్రారంభించిన నేషనల్ మిషన్ ఫర్ మానుస్క్రిప్ట్స్ ఉమ్మడి ఏపీలోని దాదాపు 2.63 లక్షల మానుస్క్రిప్ట్స్ డాక్యుమెంట్ చేసింది. వీటిలో దాదాపు ఆరువేల తాళపత్ర వ్రాతప్రతులు డిజిటలైజ్ చేయబడ్డాయని అధికారులు తెలిపారు.
ఇండియాలో మానుస్క్రిప్ట్స్ ఎక్కువగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో ఎక్కువగా లభించాయని, తాను నేషనల్ మిషన్ ఫర్ మానుస్క్రిప్ట్స్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు రెండున్నర లక్షలకు పైగా మానుస్క్రిప్ట్స్ సేకరించి డాక్యుమెంట్స్ చేశామని సంస్థ మాజీ డైరెక్టర్ జయధీర్ తిరుమలరావు తెలిపారు.
పేపర్ మానుస్క్రిప్ట్ లను లామినేట్ చేసేందుకు చైనా నుండి టిష్యు పేపర్ దిగుమతి చేసుకున్నామని, తర్వాతి కాలంలో ఆ మానుస్క్రిప్ట్స్ లను డిజిటలైజేషన్ చేయడం ప్రారంభించామని, పురాతన గ్రంధాల రక్షణ బాధ్యత పలువురికి కేటాయించామని నేషనల్ మిషన్ ఫర్ మానుస్క్రిప్ట్స్ సంస్థ అధికారులు తెలిపారు.
ఈసంస్థ 2019 వరకు దాదాపు 43.16 లక్షల మానుస్క్రిప్ట్స్ లను వివిధ భాషల్లో డాక్యుమెంట్ చేసిందట.3.92కోట్ల డాక్యుమెంట్ ఫోలియోల రక్షణ కార్యక్రామాలు చేపడుతూనే, 2.93 కోట్ల పేజీలతో కూడిన మానుస్క్రిప్ట్స్ లను డిజిటలైజేషన్ చేసిందని రానున్న కాలంలో మరిన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు. దింతో ఆయా కాలాల్లోని చరిత్ర తెలుసుకోవడం సులభమవుతుంది.