Ibrahimpatnam : న్యాయం కోసం వెళ్లిన మహిళఫై కన్నేసిన ASI
తరచూ సదరు మహిళా పోలీస్ స్టేషన్ కు రావడంతో ఆ మహిళా ఫై ఏఎస్ఐ కన్నేశాడు
- By Sudheer Published Date - 11:44 PM, Mon - 25 March 24

అయ్యా మాకు న్యాయం చెయ్యండి..నా భర్త రోజు తాగొచ్చి గొడవ పడుతున్నాడు..కొడుతున్నాడు అని ఏ బాధితురాలైన పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేస్తే..సదరు పోలీస్ అధికారి..వెంటనే సదరు భర్త ను పిలిపించి హెచ్చరిక చేసి వదిలేస్తాడు..లేదంటే నాల్గు తన్ని బుద్ది చెపుతాడు..కానీ ఇక్కడ ఓ ASI మాత్రం న్యాయం కోసం వెళ్లిన మహిళాపైనే కన్నేసి..ఏకంగా లైంగిక సంబంధం పెట్టుకొని..సమాజం ఛీ అనేలా చేసుకున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
జగిత్యాల – ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామానికి చెందిన వివాహిత.. కొద్ది రోజుల కిందట భర్త త్రాగి వచ్చి కొడుతున్నాడని న్యాయం చేయాలని ఇబ్రహీంపట్నం పోలీస్ట్రేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఏఎస్ఐ రాములు తన భర్తను పిలిపించి కౌన్సిలింగ్ చేశాడు. అయినా భర్త మారకపోవడంతో తరచూ సదరు మహిళా పోలీస్ స్టేషన్ కు రావడంతో ఆ మహిళా ఫై ఏఎస్ఐ కన్నేశాడు. విచారణ పేరుతో ఆమెను ట్రాప్‌లోకి దింపాడు. తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ ఆమెకు దగ్గరయ్యాడు.
ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ మెట్పల్లి SI దృష్టికి తీసుకువెళ్లగా ఏఎస్ఐను మందలించడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవద్దని త్వరలో రిటైర్మెంట్ ఉందని తన పద్దతి మార్చుకుంటానని బ్రతిమాలాడుకున్నాడు. అయితే ఆ ఏఎస్ఐ సదరు యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం తో ..ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఏఎస్ఐపై ఉన్నత ఆధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
Read Also : Bobbili : బొబ్బిలి లో వరుసగా వాలంటీర్ల మృతి..కారకులు ఎవరు..?