Indiramma Housing Scheme : మొదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరు
Indiramma Housing Scheme : మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొంది. తొలుత ఇళ్ల స్థలం ఉన్నవారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది
- By Sudheer Published Date - 08:39 PM, Sun - 3 November 24

Indiramma Housing Scheme : ఈ నెల 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కానుందని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొంది. తొలుత ఇళ్ల స్థలం ఉన్నవారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది. రెండో విడతలో స్థలం లేనివారికి స్థలమిచ్చి రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని పేర్కొంది. ప్రత్యేక యాప్లో లబ్ధిదారుల వివరాలు వెల్లడిస్తామంది.
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను (Indiramma Houses) కేటాయించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది సొంత స్థలం, రేషన్ కార్డున్న వారికే ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎవరెవరికి అర్హత?
ఈ పథకం కేవలం బీపీఎల్ (BPL) కార్డు ఉన్న కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది, అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఇళ్లు కేటాయిస్తారు. ఇల్లు సొంతంగా ఉండి, కిరాయి ఇంట్లో లేదా కచ్చా ఇండ్లలో నివసించే వారే అర్హులు. గడచిన కేసీఆర్ (KCR) ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మాదిరిగా కాకుండా, లబ్ధిదారుల సొంత స్థలంలో నాలుగు దశల్లో ఈ ఇండ్ల నిర్మాణం చేపడతారు.
ఇంటి నిర్మాణానికి నిధులు ఇంటి నిర్మాణానికి మొత్తం రూ. 5 లక్షలు మంజూరు చేస్తారు. పునాదులు పూర్తి అయిన తర్వాత ఒక లక్ష, రూఫ్ లెవల్‌కు చేరుకున్న తర్వాత మరో లక్ష, స్లాబ్ వేయించిన తర్వాత రూ. 2 లక్షలు, మొత్తం పూర్తయిన తర్వాత మిగిలిన లక్ష బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
అవసరమైన ధృవపత్రాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రధానంగా మహిళల పేరునే ఇల్లు మంజూరు చేయనున్నారు. ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, తెల్ల రేషన్ కార్డు వంటి ధృవపత్రాలను సమర్పించాలి.
ఈ పథకం దశలవారీగా అమలవుతుందని, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులు గ్రామసభలలో పారదర్శకంగా చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
Read Also : Viral Video: ఎన్టీఆర్ కొడుకులతో వెంకీమామ సందడి