Singareni: సింగరేణి కార్మికులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. 32 శాతం బోనస్
సింగరేణి సంస్థ లాభాల్లో 32% బోనస్ గా కార్మికులకు అందించాలని సీఎం కేసీఆర్ కేసీఆర్ నిర్ణయించారు.
- By Balu J Published Date - 05:10 PM, Tue - 26 September 23

2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ లాభాల్లో 32% బోనస్ గా కార్మికులకు అందించాలని సీఎం కేసీఆర్ కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు గని కార్మికులకు దేశంలోనే అత్యధికంగా దసరా కానుక అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
కాగా ఇటీవలనే న్ననే 11వ వేజ్‌బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను సింగరేణి యాజమాన్యం జమ చేసింది. ఉద్యోగులకు వాళ్ల వాళ్ల సర్వీస్ సీనియారిటీని బట్టి నగదు జమ అవుతుంది. ఒక్కో కార్మికుడిని ఎరియర్స్ రూపంలో దాదాపు రూ.3.70 లక్షల వరకు క్రెడిట్ అయ్యింది. ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బు రావడంతో… కార్మికులు సంతోషానికి అవదులు లేవు. కార్మికులు, వారి కుటుంబసభ్యులు సంతోషంలో మునిగిపోయారు.
సింగరేణి చరిత్రలో ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో బకాయిలను చెల్లించడం ఇదే మొదటిసారి అని చెప్పారు సంస్థ ఫైనాన్స్, పర్సనల్ డైరెక్టర్ ఎన్.బలరామ్. ముందు రెండసార్లుగా ఎరియర్స్ చెల్లించాలని భావించామన్నారు. అయితే.. సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ మొత్తం సొమ్ము ఒకేసారి చెల్లించాలని ఆదేశించారని చెప్పారు. అందుకే ఒకే విడతలో మొత్తం డబ్బు కార్మికుల అకౌంట్లలో క్రెడిట్ చేశామన్నారు.
Related News

Kadiyam Srihari: త్వరలో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వం.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..!
ఒక ఏడాది కాలంపాటు కార్యకర్తలంతా ఓపిక పడితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు.