Redmi A4 5G: రెడ్ మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. రూ.10 వేలకే అద్భుతమైన ఫీచర్స్!
మార్కెట్లోకి మరో రెడ్ మీ కొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది షావోమి సంస్థ.
- By Anshu Published Date - 01:00 PM, Fri - 18 October 24

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల రెడ్ మీ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. కొత్త కొత్త ఫోన్ల లను విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. ఇది ఇలా ఉంది తాజాగా షావోమి సంస్థ మరో రెడ్ మీ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. రెడ్‌మీ ఇండియన్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది.
రెడ్‌మీ ఏ4 పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాన్ 4ఎస్ జెన్2 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌తో భారత్‌లో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదే అని కంపెనీ చెబుతోంది. ఇకపోతే ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్స్ తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెకండరీ కెమెరా కూడా ఉంది. ఇక ఈ ఫోన్‌లో 3.5 ఎంఎం ఆడియో జాక్ ను అందించారు. ఇక ఈ ఫోన్‌లో ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ డ్యూయల్ 12 బిట్ ఐఎస్‌పీ కెమరాకు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్ ను బ్లాక్, వైట్ కలర్ లో తీసుకొచ్చారు.
అయితే ఈ ఫోన్ కి సంబంధించి తొలి సేల్ ఎప్పటి నుంచి అనే విషయాన్ని కంపెనీ ఇప్పటి వరకు ప్రకటించలేదు. రెడ్ మీ 4 స్మార్ట్ ఫోన్‌లో 6.25 ఇంచెస్ తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఇందులో 8 మెగా పిక్సెల్స్ తో కూడిన ఫ్రంట్ కెమెరాను కూడా ఇచ్చారు. ఈ ఫోన్‌ను 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో తీసుకొచ్చారు. అలాగే బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ధర విషయానికొస్తే రూ. 10 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.