Tata EV: టాటా కొత్త ఎలక్ట్రిక్ కారు న్యూ ఫీచర్స్.. సింగిల్ ఛార్జ్ తో?
దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో వాహన వినియోగదారులు ఎక్కువ శాతం
- By Nakshatra Published Date - 07:30 AM, Tue - 27 December 22
దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో వాహన వినియోగదారులు ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ వాహనాల వైపే మగ్గుచూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే ముందు ప్రతి ఒక్కరూ ఆ వాహనం ఛార్జ్ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తుంది అన్న విషయాన్ని తప్పకుండా చెక్ చేస్తూ ఉంటారు. ఇకపోతే ప్రముఖ టాటా కంపెనీ ఇప్పటికే మార్కెట్ లోకి పలు ఎలక్ట్రిక్ కార్ లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా టాటా మోటార్స్ లాంఛ్ చేసిన కొత్త ఎలక్ట్రిక్ కార్‌ను సింగిల్ ఛార్జ్ చేసి ఆ సింగిల్ ఛార్జ్ తో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లొచ్చు. టాటా మోటర్స్ మార్కెట్లోకి మరో కొత్త ఈవీని లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
అప్డేటెడ్ 2022 టిగోర్ ఈవీని ఇటీవల విడుదల చేసింది. ఈ టిగోర్ ఈవీ ధర రూ. 12.49 లక్షల నుంచి ఎక్స్-షోరూమ్ ప్రారంభమవుతుంది. అయితే 2022 టిగోర్ ఈవీ కొత్త మాగ్నెటిక్ రెడ్ కలర్ ఆప్షన్‌తో లభించునుంది. అదేవిధంగా సరికొత్త ఫీచర్ అప్‌గ్రేడ్స్‌తో ఆకట్టుకుంటోంది. ఈ అప్డేటెడ్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ సెడాన్ XE, XT, XZ+, XZ+ LUX వంటి నాలుగు వేరియంట్లలో అందుబాటులో లభిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన 2022 టిగోర్ ఈవీ 10 కొత్త ఫీచర్లతో లభిస్తుంది. కాగా దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కి.మీ. వస్తుంది. లెథెరెట్ అప్ హోల్స్టరీ, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో హెడ్‌ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ ఆల్ ఎలక్ట్రిక్ సెడాన్ మల్టీ-మోడ్ రీజెన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ Zconnect, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, iTPMS, టైర్ పంక్చర్ రిపేర్ కిట్ వంటి వాటిని ఆఫర్ చేస్తోంది.
2022 టాటా టియాగో ఈవీ IP67 సర్టిఫికేషన్‌తో 26 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 74 బిహెచ్పి పవర్, 170 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ కలిగి ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ARAI ధ్రువీకరించిన 315 కిమీ డ్రైవింగ్ రేంజ్‌తో వస్తుంది. కాగా ఇటీవలే ప్రవేశపెట్టిన టియాగో ఈవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. లాంచ్ చేసిన ఒక నెలలోనే ఏకంగా 20 వేల బుకింగ్స్ ను సాదించింది. టాటా మోటార్స్ సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ప్రస్తుత టిగోర్ ఈవీ యజమానులకు ఉచిత ఫీచర్ అప్డేట్ ప్యాక్‌ను అందిస్తోంది.
Related News
Allu Aravind: లగ్జరీ కారు కొన్న అల్లు అరవింద్… ధర ఎంతంటే..?
స్టార్ ప్రొడ్యూసర్లు, హీరోలు, దర్శకులు మార్కెట్లోకి వచ్చిన సూపర్ లగ్జరీ కార్లను కొంటుంటారు. ముఖ్యంగా మెగా మరియు అక్కినేని ఫ్యామిలీ హీరోలకు లగ్జరీ కార్లంటే పడి చస్తారు. మార్కెట్లోకి లగ్జరీ కారు రిలీజ్ అయితే ఈ రెండు కుటుంబ సభ్యుల నుంచి ఒక్కరైనా బుక్ చేస్తారు.