WhatsApp Web: వాట్సాప్ వెబ్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై గూగుల్ ఫొటోలను రివర్స్ సెర్చ్ చేయవచ్చట!
వినియోగదారుల కోసం ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
- By Anshu Published Date - 10:00 AM, Wed - 1 January 25

ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్ల మంది వినియోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ లో ఈ యాప్ కూడా ఒకటి. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్ లోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. రోజురోజుకీ ఈ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది.. అయితే వినియోగదారుల సంఖ్యను మరింత పెంచుకోవడం కోసం వాట్సాప్ సంస్థ ఇప్పటికీ ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. వాడితో పాటుగా ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ.
ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటి? ఆ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అన్న వివరాల్లోకి వెళితే.. ఆన్లైన్లో పెరుగుతున్న తప్పుడు సమాచారంని అరికట్టడం కోసం కొత్తగా కొత్త రివర్స్ ఇమేజ్ సర్చ్ ఫీచర్ ని తీసుకురాబోతోంది. ఈ కొత్త ఫీచర్ గతంలో వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా అప్లికేషన్ ద్వారా గుర్తించింది. ఇప్పుడు నివేదిక ద్వారా వాట్సాప్ వెబ్ బీటాలో కనిపించింది. వాట్సాప్ యూజర్లు గూగుల్ నుంచి అసిస్టెంట్ ద్వారా వారితో షేర్ చేసిన ఫొటోను అథెంటికేషన్ చేసేందుకు అనుమతిస్తుంది. షేర్ చేసిన ఫొటో ఎడిట్ చేసిందా? ఎవరైనా మార్పింగ్ చేశారా? అని గుర్తించడంలో కొత్త ఫీచర్ వినియోగదారులకు సహాయపడుతుందట. అయితే ఇక్కడ మంచి విషయం ఏమిటంటే..
వినియోగదారులు తమ డెస్క్‌టాప్ లో ఫొటోను డౌన్‌లోడ్ చేయనవసరం లేదట. వెబ్ అప్లికేషన్ నుంచి రివర్స్ ఇమేజ్ సెర్చ్ ప్రాసెస్ ను ప్రారంభించేందుకు వాట్సాప్ షార్ట్‌కట్ అందిస్తుందట. వాట్సాప్ యూజర్ వెబ్‌లో ఫొటో కోసం సెర్చ్ చేసే ఆప్షన్ ఎంచుకున్న తర్వాత వాట్సాప్ యూజర్ల ఆమోదంతో పేర్కొన్న ఫొటోను గూగుల్ లో అప్‌లోడ్ చేస్తుంది. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ప్రక్రియను ఎనేబుల్ చేసి డిఫాల్ట్ బ్రౌజర్ ను ఓపెన్ చేస్తుంది. అయితే మొత్తం రివర్స్ ఇమేజ్ సెర్చ్ ప్రాసెస్ ను గూగుల్ నిర్వహిస్తోంది. వాట్సాప్ కి ఇమేజ్ కంటెంట్ లను స్కాన్ చేసే యాక్సెస్ ఉండదని గమనించాలి. వాట్సాప్ ఇటీవల ఐఓఎస్ యాప్ లో డాక్యుమెంట్ లను స్కాన్ చేసే సామర్థ్యాన్ని తీసుకొచ్చింది. కొత్త ఇన్-యాప్ స్కానింగ్ ఫీచర్ ఐఓఎస్ అప్‌డేట్ లేటెస్ట్ వాట్సాప్ లో అందుబాటులో ఉంది. వినియోగదారులు యాప్ డాక్యుమెంట్ షేరింగ్ మెను ద్వారా నేరుగా డాక్యుమెంట్ లను స్కాన్ చేసేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది. ఎక్స్‌ట్రనల్ స్కానింగ్ టూల్స్ అవసరం లేకుండానే సులభంగా స్కాన్ చేయవచ్చట.