WhatsApp: వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్.. ఆ మెసేజ్ ను డిలీట్ చేసే ఆప్షన్?
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోజురోజుకీ
- By Anshu Published Date - 07:30 AM, Sat - 25 February 23

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. ఈ మధ్యకాలంలో అయితే వారానికి కనీసం రెండు మూడు ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగానే త్వరలో మరొక ఫీచర్‌ని లాంచ్ చేయనుంది. వాట్సాప్ చాట్‌లో టెక్ట్స్‌ని ఎడిట్ చేసే ఫీచర్‌ని ప్రస్తుతం డెవలప్ చేస్తోంది వాట్సాప్ సంస్థ. కాగా త్వరలో ఐఓఎస్ యూజర్లకు బీటా వెర్షన్‌ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సరికొత్త ఫీచర్‌ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందించడానికి వాట్సాప్ సంస్థ చూస్తోంది.
మెసేజ్‌లను సెండ్ చేసేసిన తర్వాత కూడా ఎడిట్ చేసే ఫీచర్ ప్రస్తుతం టెలిగ్రామ్, ఐమెసేజ్ యాప్‌లలో ఉంది. త్వరలో ఆ సదుపాయాన్ని వాట్సాప్ తన యూజర్లకు అందించనుంది. కాగా వాట్సాప్ చాట్‌లో మెసేజ్‌ని సెండ్ చేసిన తరువాత 15 నిమిషాల లోపు ఆ మెసేజ్‌ని ఎడిట్ చేసేందుకు వీలు కలిగించే ఫీచర్‌ని డెవలప్ చేస్తోంది. అంటే సెండ్ చేసిన మెసేజ్‌లలో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి యూజర్‌కి 15 నిమిషాల పాటు సమయం ఉంటుంది. అయితే 15 నిముషాలు గడువు పూర్తయ్యాక వాటిని ఎడిట్ చేసేందుకు వీలు కుదరదు. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉన్నట్లు వాట్సాప్ సంస్థ తెలిపింది. ఈ ఎడిట్ చాట్ ఆప్షన్ కేవలం టెక్ట్స్ చాట్‌కి మాత్రమే వర్తింపజేయనుంది.
అంటే ఇతర మీడియా ఫార్మాట్లకు జత చేసి పంపించే టెక్ట్స్‌ని ఎడిట్ చేసేందుకు వీలు లేదు. ఇమేజ్, వీడియో, డాక్యుమెంట్ తదితర ఫైల్స్ క్యాప్షన్స్‌ని ఒకసారి పంపిస్తే డిలీట్ చేయడం తప్ప సవరించుకునే అవకాశం ఉండదు. అలాగే ఎదుటి యూజర్‌కి తాను రిసీవ్ చేసుకున్న మెసేజ్ ఎడిట్ చేసినదైతే మెసేజ్‌పై లేబుల్ కనిపిస్తుంది. దీంతో రిసీవర్ సులువుగా గుర్తించేందుకు వీలు కలుగుతుంది. ఈ ఫీచర్ నిర్దేశిత వెర్షన్‌లలోనే సపోర్ట్ చేయనుంది. అందువల్ల, ఓల్డ్ వెర్షన్‌ని వినియోగిస్తున్న వారికి ఈ ఫీచర్ సపోర్ట్ చేయదు. ఈ అంశాన్ని రిసీవర్‌కి వాట్సాప్ మెసేజ్‌లోనే తెలుపుతుంది. ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేసుకోవాలంటే అందుకు తగిన వెర్షన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.